మాలీవుడ్ బ్యూటీ మమితా బైజు టాలీవుడ్ లో సినిమాలు చేయకముందే యువతలో ఫాలోయింగ్ సంపాదించిన బ్యూటీ. మాలీవుడ్ అనువాద చిత్రం `ప్రేమలు`తోనే బోలెడంత ఫేమస్ అయింది . నాటి నుంచి అమ్మడికి యువ తలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇటీవల రిలీజ్ అయిన `డ్యూడ్ ` తోనూ మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రదీప్ రంగనా ధ్ కు జోడీగా నటించి మెప్పించింది. తమిళ సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించిన మరో చిత్రం.
ఈ సంక్రాంతికి `జన నాయగన్` తోనూ అలరించనుంది. అదే ఏడాది సూర్య సినిమాతో తెలుగులోనూ లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ చేసి అందర్నీ పప్పులో కాలేసారంది. మమితా బైజు నటించిన తొలి సినిమా ఏది? అంటే అంతా `ప్రేమలు` చిత్రాన్నే చెబుతారు. కానీ నటిగా అసలు సినిమా అది కాదని తెలిపింది.
`ప్రేమలు` మలయాళంలో తాను నటించిన 16వ చిత్రంగా పేర్కొంది. అంతకు ముందే అదే భాషలో 15 సినిమాల్లో నటించినట్లు చెప్పుకొచ్చింది. అయితే అవన్నీ సహాయ నటి పాత్రలు మాత్రమేనని, హీరోయిన్ గా కాదని తెలిపింది. ప్రతీ సినిమా తన వరకూ కెరీర్ మాత్రమే కాదని ఎంతో ఎమోషన్ గా భావిస్తానంది. నటన పట్ల తనలో పుట్టిన ప్రేమ మాత్రమే తనని ఆస్థాయికి తీసుకెళ్లిందని తెలిపింది. సహాయ పాత్రలు పోషించకపోతే హీరోయిన్ అయ్యే దాన్ని కాదని ,అందుకే తనని హీరోయిన్ అనడం కంటే? నటి అనడం అంటేనే ఎక్కువగా లైక్ చేస్తానంది.
తన దృష్టిలో చిన్న పాత్రలు, పెద్ద పాత్రలంటూ ప్రత్యేకంగా ఏవీ ఉండవని...సినిమాలో నటించే అందరూ సమాన పాత్ర ధారులుగానే భావిస్తానంది. మొత్తానికి మమితా బైజుకు సమానత్వం అంటే ఇష్టమని ఆమె మాటల్లో క్లియర్ గా అర్దమవుతుంది. హీరోయిన్ అయినా? సినిమాలో మరో నటి అయినా అందర్నీ ఒకేలా ట్రీట్ చేస్తుందని చెప్పొచ్చు.




టైటిల్ కి నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్
Loading..