హీరో నందమూరి నటసింహ బాలకృష్ణ టైటిల్ నారి నారి నడుమమురారి తో శర్వానంద్ ఈ సంక్రాంతికి పోటీకి దిగుతున్నాడు. ఇంత కాంపిటీషన్ లో పండగకి రావడం అవసరమా అని వెన్నెల కిషోర్ అడిగితే పండగకి వచ్చి కొడుతున్నాం కదా కలిసొస్తుంది అని అంటూ శర్వా అంటాడు, వీడు మారడు అంటూ వెన్నెల చెప్పిన ప్రోమో ని మేకర్స్ రివీల్ చేసారు.
నిజంగానే సంక్రాంతి కి రెబల్ స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరు, కోలీవుడ్ విజయ్, శివకార్తికేయన్, నవీన్ పోలిశెట్టి లు పోటీపడుతున్నారు. ఇంత టఫ్ ఫైట్ లో శర్వానంద్ నారి నారి నడుమమురారి తో జనవరి 14 న రాబోతున్నాడు. మరి బాలయ్య టైటిల్ తో వస్తున్న శర్వానంద్ ని నందమూరి ఫ్యాన్స్ ఓన్ చేసుకుంటున్నారు.
నందమూరి అభిమానుల ఫుల్ సపోర్ట్ శర్వా కి వచ్చేసింది. నారి నారి నడుమమురారి ని సపోర్ట్ చేస్తూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు. మరి ఈ విధంగా శర్వానంద్ కి నందమూరి అభిమానులు విజయాన్ని సొంతం చేస్తారేమో చూద్దాం.




భార్య శోభిత-మరదలు తో నాగ చైతన్య 
Loading..