Advertisementt

ఢిల్లీ వీధుల్లో పెద్ది రామ్ చరణ్

Sun 21st Dec 2025 02:36 PM
ram charan  ఢిల్లీ వీధుల్లో పెద్ది రామ్ చరణ్
Peddi Shooting update ఢిల్లీ వీధుల్లో పెద్ది రామ్ చరణ్
Advertisement
Ads by CJ

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది షూటింగ్ జెట్ స్పీడు లో జరుగుతుంది. పెద్ది మార్చ్ 27 కి రాదేమో అనే ఊహాగానాలను కొట్టిపారేస్తూ మేకర్స్ ఎప్పటికప్పుడు పెద్ది రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. పక్కాగా మార్చ్ 27 నే పెద్ది రిలీజ్ అంటూ బలంగా చెబుతున్నారు. 

ప్రస్తుతం పెద్ది యూనిట్ మొత్తం ఢిల్లీ లో ఉంది. అక్కడికి పెద్ది షెడ్యూల్ కోసం వెళ్లగా.. పెద్ది లుక్ లో రామ్ చరణ్ ఢిల్లీ వీధిల్లో చేతిలో సంచితో కనిపించారు, ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది లుక్ లో ఢిల్లీ లో కనిపించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ పోలీస్ బారిగేడ్స్ దగ్గర వాటిని దాటుకున్న చరణ్ పిక్స్ ని మెగా అభిమానులు వైరల్ చేస్తున్నారు. 

పెద్ది చిత్రం చికిరి సాంగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో, పెద్ది ఫస్ట్ షాట్ అంతే ట్రెండ్ అయ్యింది. ఇక ఈ చిత్రం లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ విలన్ గా కనిపిస్తుండగా.. జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. 

Peddi Shooting update :

Ram Charan Peddi movie shooting update 

Tags:   RAM CHARAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ