ఈరోజు ఆదివారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో సీజన్ 9 పూర్తవుతుంది. అయితే బిగ్ బాస్ పూర్తవుతుంది అని చాలామంది దిగులుపడుతుంటే.. ఎక్కువమంది మేము బిగ్ బాస్ ని మిస్ అవ్వము కానీ.. తనూజ - కళ్యాణ్ లని బాగా మిస్ అవుతామంటూ కామెంట్లు పెట్టడం గమనార్హం.
మొదటి మూడు వారాల్లో ఎలాంటి ఫ్రెండ్ షిప్ లేని తనూజ, కళ్యాణ్ పడాల ఆతర్వాత ఓ టాస్క్ లో కలిసి ఆడి మంచి ఫ్రెండ్స్ అవ్వడమే కాదు తనూజ కోసం కళ్యాణ్, కళ్యాణ్ కోసం తనూజ చివరి వరకు నిలబడ్డారు. అయితే తనూజ, కళ్యాణ్ ల ఫ్రెండ్ షిప్ పై వైల్డ్ కార్డు ఎంట్రీస్, ఆఖరికి శ్రీజ అపార్ధం చేసుకుని వారిని విడగొట్టాలని చూసారు. తనూజ ఫేక్, ఆమె జెన్యూన్ కాదు అంటూ కళ్యాణ్ కి శ్రీజ డైరెక్ట్ గా చెప్పింది.
మాధురి, రమ్య మోక్ష లు తనూజ ను బ్యాడ్ చెయ్యాలని చూసారు, కళ్యాణ్ ని కిందేసి తొక్కుతా అన్న రమ్య మోక్ష రెండు వారాలకే వెళ్ళిపోయింది. కళ్యాణ్-తనూజ ఫ్రెండ్ షిప్ మొదట్లో ఇమ్మాన్యుయేల్ కి నచ్చలేదు, భరణి కి నచ్ఛలేదు. కానీ వారి ఫ్రెండ్ షిప్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.
వాళ్ళను వైల్డ్ కార్డు ఎంట్రీలు లవర్స్ గా ప్రొజెక్ట్ చేశారు. కానీ ఎక్కడా తనూజ కళ్యాణ్ కి ఛాన్స్ ఇవ్వలేదు, ప్యూర్ గా వారి ఫ్రెండ్ షిప్ కనిపించడమే కాదు వారు కలిసి కూర్చుని మట్లాడుకున్నా, నడిచినా, ఎమోషన్స్ షేర్ చేసుకున్నా ఆ వీడియోస్ ని ఆడియన్స్ బాగా ఇష్టపడ్డారు.
చివరి మూడు వారాలు అంటే రీతూ వెళ్ళిపోయాక డిమోన్ పవన్-తనూజ లు టామ్ అండ్ జెర్రీ లా కొట్టుకున్న వీడియోస్ ని కూడా ఆడియన్స్ లైక్ చేసారు. అందుకే బిగ్ బాస్ అయ్యిపోతుంది అంటే తనూజ-కళ్యాణ్ లు ఇక కనబడరని, వాళ్ళను చాలా మిస్ అవుతామని చాలామంది ఫీలవుతున్నారు.




ఢిల్లీ వీధుల్లో పెద్ది రామ్ చరణ్
Loading..