Advertisementt

టాక్సిక్‌ - నాడియా గా కియారా అద్వానీ లుక్

Sun 21st Dec 2025 01:08 PM
toxic  టాక్సిక్‌ - నాడియా గా కియారా అద్వానీ లుక్
Toxic-First Look of Kiara Advani as Nadia Unveiled టాక్సిక్‌ - నాడియా గా కియారా అద్వానీ లుక్
Advertisement
Ads by CJ

రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తోన్న‌ టాక్సిక్‌: ఎ ఫెయిరీటేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్ కోసం అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాపై రోజు రోజుకీ అంచ‌నాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి నాడియా పాత్ర‌లో న‌టిస్తోన్న‌ హీరోయిన్ కియారా అద్వానీ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌టంతో ఫ్యాన్స్‌లో మ‌రింత ఉత్సాహం పెరిగింది.

ఎమోష‌న‌ల్, హై వోల్టేజ్ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ ఇలా... వైవిధ్యమైన సినిమాలు, పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంది కియారా అద్వానీ . ఇప్పుడు గీతూ మోహ‌న్ దాస్ రూపొందిస్తోన్న శ‌క్తివంత‌మైన ప్ర‌పంచంలోకి నాడియా పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ పాత్ర ఆమె ఫిల్మోగ్ర‌ఫీ రేంజ్‌లో మ‌రింత పెంచేలా స‌రికొత్త‌గా ఉంది.

నాడియాగా కియారా అద్వానీ పస్ట్ లుక్ ఆస‌క్తిక‌రంగా ఉంది. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే క‌ల‌ర్‌ఫుల్ బ్యాక్ డ్రాప్ క‌నిపిస్తోంది. కియారా అంద‌రి కంటే ముందు నిలుచుకుని ఉంది. ఆమె పాత్ర‌లో లోతైన భావోద్వేగాలు క‌నిపిస్తున్నాయి. ఈ హంగామా వెనుక బాధ‌, విషాదం ఏదో ఉన్న‌ట్లుగా అనిపిస్తోంది. ఆమె పాత్ర పెర్ఫామెన్స్‌కు ప్రాధాన్య‌త‌నిచ్చేలా క‌నిపిస్తోంది. లుక్ చూస్తుంటే ఇదేదో సాధార‌ణమైన పాత్ర కాద‌ని, ఆమె కెరీర్‌ను మ‌లుపు తిప్పేలా ఉంద‌నిపిస్తోంది.

నాడియా పాత్ర, కియారా అద్వానీ గురించి డైరెక్ట‌ర్ గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ ‘కొన్ని పాత్రల్లో నటించినప్పుడు అవి సినిమాకే పరిమితం కావు. యాక్టర్‌కు స‌రికొత్త గుర్తింపును తీసుకొస్తాయి. నాడియా పాత్ర‌లో కియారా చేసిన న‌ట‌న డిఫ‌రెంట్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌తో క‌నిపిస్తుంది. ఆమె పెర్ఫామెన్స్ చూసి చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ ప్ర‌యాణంలో నాపై, నా టీమ్‌పై నమ్మ‌కం పెట్టుకుని, మ‌నస్ఫూర్తిగా ఆమె స‌పోర్ట్ చేసిన‌ తీరుకి ధ‌న్యావాదాలు అన్నారు.

Toxic-First Look of Kiara Advani as Nadia Unveiled :

First Look of Kiara Advani as Nadia Unveiled from Yash Toxic

Tags:   TOXIC
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ