Advertisementt

రాజాసాబ్ పై అపోహలు-నిర్మాత ట్వీట్

Sun 21st Dec 2025 12:23 PM
the raja saab  రాజాసాబ్ పై అపోహలు-నిర్మాత ట్వీట్
Raja Saab Producer Condemns Rumors రాజాసాబ్ పై అపోహలు-నిర్మాత ట్వీట్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. దర్శకుడు మారుతి తో చేస్తున్న ద రాజాసాబ్ చిత్రం జనవరి 9 న సంక్రాంతి స్పెషల్ గా విడుదల కాబోతుంది. పలుమార్లు వాయిదా పడి ఫైనల్ గా సంక్రాంతికి వస్తున్న ఈ చిత్రం పై అంచనాలు ఎలా ఉన్నాయి, రాజాసాబ్ పై క్రేజ్ ఎలా ఉంది అనే విషయంలో అభిమానుల్లో అనుమానాలున్నాయి. 

సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.. రాజాసాబ్ ప్రేక్షకులకు ఎంత రీచ్ అవుతుందో అనే విషయంలో అపోహలు ఉన్నాయి. రాజాసాబ్ బిజినెస్ పై, ఓవర్సీస్ లెక్కలపై, ఇంకా రాజా సాబ్ ఓటీటీ డీల్ పై సోషల్ మీడియాలో కనిపిస్తున్న న్యూస్ లు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

దానితో రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సోషల్ మీడియా వేదికగా రాజాసాబ్ అపోహాలపై స్పష్టతనిచ్చారు. 

మా ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ సినిమా అయిన ద రాజాసాబ్ అంతర్గత లెక్కల గురించి బయటికి చెప్పలేమని, మా సినిమాకు థియేటర్లలో రిలీజ్ తర్వాత వచ్చే లెక్కలను ఖచ్చితంగా అఫీషియల్ గా ప్రకటిస్తామని, ఈ రోజుల్లో నాన్-థియేట్రికల్ మార్కెట్లో సాధారణంగా సర్దుబాట్లు జరుగుతుంటాయని ఆ ట్వీట్ లో ఆయన తెలిపారు. 

థియేటర్లలో మాత్రమే అసలైన నంబర్స్ వస్తాయని, అయినప్పటికీ కూడా మా సినిమా కి ఇప్పుడు అత్యధిక నాన్- థియేట్రికల్ డీల్ సాధించిందని విశ్వప్రసాద్ ఆ ట్వీట్లో రాసుకొచ్చారు.

Raja Saab Producer Condemns Rumors:

The Raja Saab Producer 

Tags:   THE RAJA SAAB
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ