నిత్యం రోడ్ ప్రమాదాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అప్పుడప్పుడు సెలబ్రిటీల కార్ యాక్సిడెంట్ల గురించిన వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అలాంటి ఓ రెండు ఘటనలు ఇప్పుడు చర్చగా జరిగాయి.
ఈ శనివారం నాడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కార్ యాక్సిడెంట్ కి గురైందని వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే బాలీవుడ్ నటి నోరా ఫతేహి కార్ కూడా ప్రమాదంలో చిక్కుకుందని కథనాలొచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ శనివారం నాడు చెన్నైలోని మధ్య కైలాష్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్ లో తనకు ఎదురుగా వచ్చేసిన ఒక కార్ నేరుగా ఢీకొట్టడంతో శివకార్తికేయన్ కార్ కి డ్యామేజ్ అయింది. అయితే అదృష్టవశాత్తూ అతడికి ఎలాంటి గాయాలు అవ్వలేదు.
అదే రోజు ముంబైలో మరో ఘటనలో ప్రముఖ ఐటమ్ గాళ్ నోరా ఫతేహి కార్ ప్రమాదానికి గురైంది. బాగా తాగి ఉన్న ఒక డ్రైవర్ నేరుగా నోరా ఫతేహి కార్ ని పక్క వైపుగా వచ్చి గుద్దాడు. దీంతో నోరా వెళుతున్న కార్ తీవ్రంగా డ్యామేజ్ అయింది. అయితే నటి నోరా ఫతేహి ఈ ఘటనలో స్వల్పగాయాలతో బయటపడ్డారు. కార్ ప్రమాదం జరిగిన వెంటనే తనను సమీపంలోని ఓ ఆస్పత్రికి సిబ్బంది తరలించగా, పెద్దగా ప్రమాదం ఏదీ లేదని సీటీ స్కాన్ రిపోర్టులో తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాద ఘటన తర్వాత కూడా నోరా ఫతేహి సిటీలోని సన్ బర్న్ 2025 ఉత్సవాల్లో తన ప్రదర్శనను ఇచ్చి ఆశ్చర్యపరిచారు. నోరా కమిట్ మెంట్ కి ఇది నిదర్శనం అని అభిమానులు కితాబిచ్చారు. నోరా ఫతేహి బాహుబలి మనోహరిగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన నర్తకి.




వెనకడుగు వేస్తున్న పోలిశెట్టి
Loading..