ప్రస్తుతం సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ జోరు మాములుగా లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ద రాజాసాబ్ పాటలు, మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు పాటలు, రిలీజ్ తేదీ అనౌన్స్ చేయడాలు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్, సాంగ్స్, ప్రెస్ మీట్ అంటూ హడావిడి చేయడాలు..
శర్వానంద్ నారి నారి నడుమమురారి నుంచి వీడియో బిట్స్ రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చెయ్యడం..అబ్బో టాలీవుడ్ సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ ఓ రేంజ్ లో స్టార్ట్ అయ్యాయి. ప్రతి రోజు ఏదో ఒక సినిమా ప్రమోషన్స్ తో మీడియా వాళ్ళు హడావిడి పడుతున్నారు. అయితే అదే సంక్రాంతి కి వస్తామని గట్టిగా చెప్పిన పోలిశెట్టి అనగనగ ఒక రాజు సందడి తగ్గింది.
ప్రమోషన్స్ పరంగా డిఫ్రెంట్ గా మొదలు పెట్టి సాంగ్ వదిలి, రిలీజ్ డేట్ కానీ, మిగతా ప్రమోషనల్ కంటెంట్ కానీ ఇవ్వకుండా నవీన్ పోలిశెట్టి అండ్ మేకర్స్ సైలెంట్ అవడం వెనుక రకరకాల అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ముందు నుంచి సంక్రాంతి రిలీజ్ అంటూ చెప్పడమే కాదు ప్రమోషన్స్ పరంగా కొత్తదనం చూపించారు.
కానీ ఇప్పుడు మాత్రం నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు హడావిడి కనిపించకపోయేసరికి సినిమా సంక్రాంతికి వస్తుందా, రాదా అనే అనుమానం స్టార్ట్ అయ్యింది.




BB9 ఫినాలే - ఇది అన్ ఫెయిర్ బిగ్ బాస్
Loading..