బిగ్ బాస్ సీజన్ 9 బజ్ కి హోస్ట్ గా చేస్తున్న శివాజీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిని చెడుగుడు ఆడుకుంటున్నారు. అలా బయటికి వచ్చిన వారిలో ప్రియా, రమ్య మోక్ష, మాధురి, నిఖిల్, రీసెంట్ గా రీతూ చౌదరి, సుమన్, భరణి బజ్ ఇంటర్వూస్ తెగ హైలెట్ అయ్యాయి. శివాజీ ఎలాంటి మొహమాటం లేకుండా వారందరిని హౌస్ లో చేసిన పనులు చెబుతూ ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
రీతూ ని అయితే డిమోన్ పవన్ విషయంలో అడిగిన ప్రశ్నలకు ఆమెకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. మొహం మాడిపోయింది. తాజాగా శివాజీ, లయ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. అక్కడ డిమోన్ పవన్ బుగ్గలు పట్టుకుని పాపం కుర్రాడు ఒంటరివాడైపోయాడు, ఒక్కడైపోయాడు, రీతూ వెళ్ళాక అంటూ పవన్ ని తెగ ఏడిపించాడు.
అంతేకాదు రీతూ-డిమోన్ పవన్ ల పై లయ తో కలిసి స్కిట్ చేసాడు, అది చూసిన వాళ్లంతా బిగ్ బాస్ బజ్ లోనే కాదు హౌస్ లోను శివాజీ కంటెస్టెంట్స్ తో ముఖ్యంగా డిమోన్ పవన్ తో ఆడుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




నిధి అగర్వాల్ ని చూసి నేర్చుకోవాలి
Loading..