అవును హీరోయిన్ నిధి అగర్వాల్ ని చూసి చాలామంది హీరోయిన్స్ చాలా నేర్చుకోవాలి. తను నటించిన సినిమాల ప్రమోషన్స్ కోసం ఆమె ప్రాణం పెడుతుంది. గతంలో హరి హర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లోను నిధి అగర్వాల్ కష్టపడింది. పవన్ కళ్యాణ్ లేకుండానే ఆమె సినిమాని భుజాల మీద మోస్తూ ప్రమోషన్స్ చేసింది.
ఇప్పుడు రాజా సాబ్ విషయంలోనూ నిధి అగర్వాల్ అలానే చేస్తుంది. దర్శకుడు మారుతి తో కలిసి సినిమాని తెగ ప్రమోట్ చేస్తుంది. ప్రభాస్ అవైలబుల్ లేకపోయినా నిధి అగర్వాల్ మాత్రం రాజా సాబ్ ని వదలడం లేదు. రీసెంట్ గా హైదరాబాద్ లులు మాల్ లో రాజా సాబ్ సెకండ్ సాంగ్ లాంచ్ లో పాల్గొని అభిమానుల తాకిడికి ఇబ్బంది పడిన నిధి అగర్వాల్ ఆతర్వాత సోషల్ మీడియాలో సినిమాని ప్రమోట్ చేస్తుంది.
ఇక ఈ రోజు ద రాజాసాబ్ కోసం ఆమె తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది. అక్కడ సినిమాని ప్రమోట్ చేస్తూ టాప్ 5 కంటెంట్స్ తో ఆటలాడించింది. అలా నిధి అగర్వాల్ ని చూసి చాలామంది హీరోయిన్స్ నేర్చుకోవాలి అంటూ మాట్లాడుతున్నారు. సినిమాలో నటించడమే కాదు సినిమాని ప్రమోట్ చెయ్యాలి, మిగతా హీరోయిన్స్ కూడా నిధి ని చూసి నేర్చుకోమని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.




BB9: కళ్యాణ్ కి సీరియల్ ఆర్టిస్ట్ ల సపోర్ట్
Loading..