బిగ్ బాస్ సీజన్ 9 ముగియడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. ఈ ఆదివారమే సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. మెగాస్టార్ చిరు సీజన్ 9 చీఫ్ గెస్ట్ అంటున్నారు. మరికొన్ని పేర్లు వినబడుతున్నా ఈ సీజన్ ట్రోఫీ ఎవరు గెలుస్తారో అనే విషయంలో క్యూరియాసిటీ కన్నా ఎక్కువగా బయట కన్నడ vs తెలుగు వార్ మొదలైంది.
కళ్యాణ్ పడాల గెలవాలని తెలుగోళ్లు, కన్నడ అమ్మాయి తనూజ గెలవాలని ఆమె అభిమానులు మధ్యన పెద్ద ఫైట్ జరుగుతుంటే.. కొంతమంది ముఖ్యంగా సీరియల్ ఆర్టిస్ట్ లు ఇంకా బిగ్ బాస్ రివ్యూయర్స్ కళ్యాణ్ పడాల ను గెలిపించాలని బిగ్ డిబేట్ లు పెడుతున్నారు. కన్నడ నటి యష్మి, తెలుగు నటి సత్య, గీతూ రాయల్, ఆది రెడ్డి లు కళ్యాణ్ పడాల గెలుపు కోసం లైవ్ లో కష్టపడుతున్నారు.
యష్మి, శ్రీ సత్య లు తనూజను బ్యాడ్ చేస్తున్నారు. ఆమె చరిత్ర గురించి తమకు తెలుసు అంటూ తనూజ ను బ్యాడ్ చేస్తూ ఆమె అభిమానులకు కోపం తెప్పిస్తున్నారు. ఇక వీరితో పాటుగా ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రియా, శ్రీజ లు కళ్యాణ్ పడాల గెలవాలంటూ క్యాపెయినింగ్ మొదలుపెట్టారు.
మరి యష్మి ని ఒక ఆడపిల్లవై ఉండి తనూజకు సపోర్ట్ చెయ్యరా అని అడిగితే.. నేను ఆడపిల్లనే, నన్ను గత సీజన్ లో సపోర్ట్ చేస్తూ ఎందుకు టాప్ 5 కి పంపలేదు అంటూ ఆమె గట్టిగా ఇచ్చిపడేసింది. మరి వీరు కోరుకున్నట్టుగా కళ్యాణ్ పడాలనే విన్నర్ అవుతాడేమో చూడాలి.




స్టయిల్ మారుస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్
Loading..