బిగ్ బాస్ సీజన్ 9 చివరి వారానికి చేరుకుంది. మరొక్క వారం లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకోవడానికి సిద్దమైంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. టాప్ 5 లోకి ఇప్పటికే కళ్యాణ్ పడాల అడుగుపెట్టగా, ఇమ్మాన్యుయేల్ ఓట్ అప్పీల్ తో టాప్ 5 కి వెళ్లిపోయినట్టే.. తర్వాత ఓట్ అప్పీల్ తో తనూజ టాప్ 5 ని కన్ ఫర్మ్ చేసుకుంది.
ఇక మిగిలిన సంజన, డిమోన్ పవన్, భరణి, సుమన్ శెట్టి లు ఇంకా డేంజర్ జోన్ లో కనబడుతున్నారు. డిమోన్ పవన్ ఈ వారం టాస్క్ లు చితక్కొట్టేసి ఓటింగ్ లో ముందజలోకి వెళ్లినా.. తనూజ ని అలాగే రెండో స్థానంలో ఉన్న సంజన ను బీట్ చెయ్యలేకపోయాడు. సంజన ఫ్యాన్ బేస్ ఆమెను హౌస్ లో ఉంచేందుకు ఓట్లు గుద్దుతున్నారు. అసలు ఆమెను ఎలిమినేట్ చెయ్యాలని చాలామంది కోరుకుంటున్నారు. గత వారం రీతూ ప్లేస్ లో సంజన ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటే రీతూ చౌదరి ని ఎలిమినేట్ చేసారు.
ఇక ఈ వారం సంజన స్ట్రాంగ్ గా నే కనిపిస్తుంది. ఆతర్వాత మూడో ప్లేస్ లో డిమోన్ పవన్ ఓట్లు కొల్లగొతున్నాడు. ఇక తర్వాత స్థానాల్లో భరణి, సుమన్ శెట్టి లు డేంజర్ జోన్ లో కనబడుతున్నారు. ఈ ఇద్దరిలో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. భరణి ఈ వారం టాస్క్ లు బాగా ఆడాడు. కాబట్టి అతన్ని ఉంచినా కానీ డబుల్ ఎలిమినేషన్ లో వెళ్లి పోయే ఛాన్స్ అయితే కనబడుతున్నాయి.




పెద్ది వెనక్కి-ఉస్తాద్ ముందుకు
Loading..