Advertisementt

అఖండ 2 హిట్ అయితే కష్టమే

Thu 11th Dec 2025 12:20 PM
mowgli  అఖండ 2 హిట్ అయితే కష్టమే
Mowgli Success Depends On Akhanda 2 అఖండ 2 హిట్ అయితే కష్టమే
Advertisement
Ads by CJ

ప్రముఖ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల లేటెస్ట్ చిత్రం మోగ్లీ. డిసెంబర్ 12 విడుదల అంటూ టీమ్ తెగ ప్రమోషన్స్ చేసింది. దర్శకుడు సందీప్ రాజ్ ప్రాణం పెట్టి ప్రమోషన్స్ చేసుకున్నాడు. కానీ అఖండ 2 రూపంలో వారికి పెద్ద అడ్డంకి వచ్చి పడింది. డిసెంబర్ 5 న అఖండ 2 రిలీజ్ అయితే మోగ్లీ కి ఎలాంటి బాధ ఉండేది కాదు.

కానీ ఇప్పుడు డిసెంబర్ 12 న మోగ్లీ విడుదల తేదికి అఖండ 2 వస్తూ ఉండడంతో దర్శకుడు సందీప్ రాజ్ నా బ్యాడ్ లక్ అంటూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. అది సరే మోగ్లీ ని క్రిష్ట్మస్ బరిలో దించుదామంటే ఆ స్లాట్ ఖాళీ లేదు. అందుకే ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ 13 న మోగ్లీని విడుదల చేస్తున్నట్టుగా గా ప్రకటించారు.

మరి అఖండ 2 విడుదల రోజుల ఓపెనింగ్స్ ఉండవు అని భావించి తర్వాత రోజు విడుదల చేస్తున్నారు. బాగానే ఉంది. కానీ అఖండ 2 గనక హిట్ అయితే మోగ్లీ ని ఎవరు పట్టించుకుంటారనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న. అఖండ 2 హిట్ అయితే మోగ్లీ కి కష్టమే. 

Mowgli Success Depends On Akhanda 2:

  Mowgli Locking Horns with Akhanda 2  

Tags:   MOWGLI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ