పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తో బుచ్చి బాబు తెరకెక్కిస్తున్న పెద్ది పాన్ ఇండియా చిత్రం మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ అంటూ మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేసారు. అయితే ఈమధ్య కాలంలో పెద్ది మార్చి 27 కి రాలేదు, అందుకు తగ్గట్టుగా పోస్ట్ ప్రొడక్షన్ అవి అప్పటికి అయ్యే ఛాన్స్ లేదు అనే ప్రచారం జరిగింది.
కానీ బుచ్చిబాబు మాత్రం పెద్ది ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చ్ 27 నే విడుదల అంటూ పదే పదే కన్ ఫర్మ్ చేస్తున్నారు. తాజాగా పెద్ది మార్చ్ 27 నుంచి వెనక్కి వెళ్లి ఆ స్థానంలోకి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రావొచ్చని సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. హరీష్ శంకర్ అందుకు అనుగుణంగానే ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ రివీల్ చేస్తున్నారని అంటున్నారు.
ముందు నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ రిలీజ్ అంటున్నారు. అందుకే కొడుకు రామ్ చరణ్ బాబాయ్ కి ఎలాంటి అడ్డంకి లేకుండా మార్చ్ నుంచి తప్పుకుంటున్నాడని తెలుస్తుంది. మరి ఈ విషయంలో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ విషయం వింటే మెగా ఫ్యాన్స్ కి ఓ డిజప్పాయింట్ న్యూస్, ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి.




బైకర్ వెనక్కి మురారి ముందుకి 
Loading..