శర్వానంద్ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ముందుకు రావాల్సిఉంది. డిసెంబర్ 6 న ఆయన నటించిన బైకర్ మూవీ రిలీజ్ అంటూ మేకర్స్ రిలీజ్ తేదీ ఇవ్వడమే కాదు అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఆతర్వాత ఎందుకో బైకర్ ప్రమోషన్స్ ఆపేసారు. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 12 కి వెళ్ళింది అన్నారు.
కానీ బైకర్ నుంచి ఎలాంటి హడావిడి కనిపించలేదు. రేపు శుక్రవారం అఖండ 2 రిలీజ్ అవుతుంది. కానీ బైకర్ ఆచూకీ లేదు. బైకర్ తర్వాత విడుదల అన్న నారి నారి నడుమ మురారి చిత్రం ఫుల్ స్వింగ్ లో రిలీజ్ తేదీ అలాగే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు. శర్వానంద్ మురారి చిత్రం పొంగల్ బరిలోకి రావడం షాకిచ్చే విషయమే. మెగాస్టార్ చిరు, ప్రభాస్ నడుమ నారి నారి నడుమ మురారి చిత్రాన్ని జనవరి 14 రిలీజ్ అంటూ అనౌన్స్ చేసారు.
అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు అసలు బైకర్ ముందు రావాల్సింది. బైకర్ జాడ లేదు, కానీ మురారి దూకుడుమీదున్నాడు. ఈ లెక్కన బైకర్ ఈనెలలో అవిచ్చే ఛాన్స్ లేదు, క్రిస్టమస్ బరి ఫుల్ అయ్యింది. మరి నారి నారి నడుమ మురారి వచ్చాక బైకర్ లైన్ లోకి వస్తుందేమో చూడాలి.




రకుల్‌ని కాస్టింగ్ ఏజెంట్లు ఇబ్బంది పెట్టారా
Loading..