బిగ్ బాస్ సీజన్ 9హౌస్ లో ఎవరితో ఎలాంటి గొడవ పెట్టుకోకుండా సాఫ్ట్ గా కూల్ గా ఆడుకుంటూ ఫైనల్ వరకు వచ్చేసాడు సుమన్ శెట్టి. అతన్ని ఎవరూ ఆటలో చేర్చుకోకపోయినా సుమ్ము డార్లింగ్ అంటూ తనూజ సుమన్ శెట్టి ని లాక్కొచ్చినా.. అడియన్సు సుమన్ శెట్టి ని ఇష్టపడ్డారు. ఒకొనొక సమయంలో సుమన్ శెట్టి నామినేషన్స్ లోకి వస్తే టాప్ కంటెస్టెంట్స్ తనూజ, కళ్యాణ్ లకు వోటింగ్ లో గట్టి పోటీ ఇచ్చేవాడు.
బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున గ్యాలరీలో ఉన్న బిగ్ బాస్ ఫ్యాన్స్ ని మీకు హౌస్ లో ఎవరి గేమ్ ఇష్టమంటే 100 శాతం సుమన్ శెట్టి ది అన్నారు. అప్పుడే చాలామంది షాకయ్యారు. ఆతర్వాత అతని గ్రాఫ్ పెరిగింది. కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ లో ఆయన భార్య వచ్చి మీరు తనూజ తో తగ్గించండి, ఆమె ఎవరు స్ట్రాంగ్ గా ఉంటె వారితో ఉంటుంది, మీ ఇద్దరూ ఉన్నప్పుడు ఆమె హైలెట్ అవుతుంది అని సుమన్ శెట్టి చెవిలో ఊదిందో అప్పుడే సుమన్ శెట్టి గ్రాఫ్ పడిపోవడం స్టార్ట్ అయ్యింది.
సుమన్ శెట్టి తనూజ ను ఏమి అనలేదు, కానీ ఆయన భార్యను సోషల్ మీడియాలో ఏసుకున్నారు. అదే సుమన్ ఫ్యాన్ బేస్ పోవడానికి కారణయింది. టాప్ 5 లో కచ్చితంగా ఉంటాడు కాదు.. ఈ సీజన్ కప్పు కూడా పట్టుకుపోతాడు అనుకున్న సమయంలో సుమన్ శెట్టి పాతాళానికి పడిపోయి డేంజర్ జోన్ లో కనిపిస్తున్నాడు.
గత వారమే బాటమ్ లైన్ లో నిలబడిన సుమన్ శెట్టి హౌస్ లో ఉన్న సంజన కన్నా స్ట్రాంగ్ కానీ.. తనూజ ఫ్యాన్స్ ఎఫెక్టో, లేదంటే ఆటలో అతని తీరు నచ్చకనో జనాలు ఓట్లు వెయ్యక ఈవారం డేంజర్ జోన్ లోకి అవిచ్చి పడ్డాడు, ఈ వారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అయినా షాకవ్వక్కర్లేదు.




జైలు జీవితం పెద్ద గుణపాఠం: స్టార్ హీరో
Loading..