Advertisementt

రిలాక్స్ అవ్వరా సీఎం గారు

Thu 04th Dec 2025 10:27 AM
chandrababu naidu  రిలాక్స్ అవ్వరా సీఎం గారు
CM Chandrababu Naidu రిలాక్స్ అవ్వరా సీఎం గారు
Advertisement
Ads by CJ

అవును 75 ఏళ్ళ వయసులోనూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుర్రాడి మాదిరిగా ప్రజల్లోకి వెళ్లడం, ఏపీ కి ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చేందుకు తపన పడడం, ఇండియా పటంలో ఏపీ ని అగ్ర స్థాయిలో నిలిపేందుకు విదేశీ టూర్స్ వెళ్లి అక్కడ పెట్టుబడులను ఆకర్షించడం, ప్రతి నెల 1 వ తేదీన పెన్షన్స్ పంపిణి చెయ్యడం, అమరావతి, వైజాగ్, హైదరాబాద్ అంటూ ఆకలియదిరగడం చూసిన వారు సీఎం గారు కూటమి అధికారంలో కి వారు ఏడాదిన్నర అయినా మీరు ఇంకా గెలిపించిన ప్రజల్లోనే తిరుగుతున్నారు, మీరు ఇక రిలాక్స్ అవ్వరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

కొడుకు నారా లోకేష్ అమెరికా టూర్ వెళుతున్నారు. అక్కడ ఏపీ కోసం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అటు తండ్రి, ఇటు కొడుకు ప్రజల కోసమే తామున్నట్టుగా పని చెయ్యడం ప్రతి తెలుగు దేశం కార్యకర్తకు, అభిమానికి చెప్పలేని ఉత్సహాన్నిస్తుంది. ముఖ్యంగా ఏజ్ జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అని సీఎం అడుగడుగునా నిరూపిస్తున్నారు. 

ఎక్కడ చూడు ఎనేర్జిటిక్ స్పీచ్ లు, పవన్ తో స్నేహ  బంధం, ప్రజలతో మమేకమవుతున్న తీరు, తన మంత్రులను ముందుండి నడిపించడమే కాదు పని చెయ్యని ఎమ్యెల్యేలకు క్లాస్ లు ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిమిషము విశ్రాంతి తీసుకోకుండా ప్రజల కోసం పని చేస్తున్నారు. విశ్రాంతి నా డిక్షనరీలోనే లేదు అన్నట్టుగా అయన ప్రవర్తిస్తున్నారు. 

గత ముఖ్యమంత్రి సీఎం పదవి చేపట్టాక తాడేపల్లి ప్యాలెస్ లోనే విశ్రాంతి తీసుకుంటూ ప్రజలను మర్చిపోయి బటన్ నొక్కే సీఎం గా ప్రసిద్ధి గాంచితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల కోసం పని చేసే మనిషిగా అందరి చేత పొగిడించుకుంటున్నారంటూ ఏపీ ప్రజలు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. 

CM Chandrababu Naidu:

Chandrababu Naidu

Tags:   CHANDRABABU NAIDU
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ