బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ స్వేచ్ఛా జీవితం, డ్రగ్ అడిక్షన్, మగువల పిచ్చి వగైరా వగైరా అంశాలతో పాటు
అతడిని టాడా కేసులో అరెస్ట్ చేసి జైలులో వేసిన విషయాలను కూడా రాజ్ కుమార్ హిరాణీ `సంజూ` చిత్రంలో చూపించిన సంగతి తెలిసిందే. దత్ బయోపిక్ లో రణబీర్ కపూర్ అద్భుతంగా నటించారు.
1993లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం భారతదేశంలో తీవ్ర పరిణామాల గురించి తెలిసిందే. హిందూ ముస్లిమ్ అల్లర్లతో మెట్రో నగరాలు అట్టుడికాయి. ఆ సమయంలోనే సంజయ్ దత్ కుటుంబానికి తీవ్రమైన వార్నింగులు అందాయని కథనాలొచ్చాయి. సరిగ్గా ఆ సమయంలో సంజయ్ దత్ అక్రమాయుధాలు కలిగి ఉన్నాడనే నేరంపై అరెస్టయ్యాడు. అతడి ఇంట్లో తుపాకులు మారాణాయుధాలు ఉన్నాయని అనుమానించి అతడిని అరెస్ట్ చేసారు. ఈ కేసులో అరెస్టయిన సంజూ ఐదేళ్ల పాటు జైలు శిక్షణు అనుభవించాడు. రెండున్నర దశాబ్ధాల పాటు ఈ కేసును కోర్టులో విచారించారు.
అయితే విచారణకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఇప్పటికీ అర్థం కాలేదని సంజయ్ దత్ తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. త్వరగా విచారించి కేసును ముగించాలని తాను కోరినట్టు సంజయ్ దత్ తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు. జైలు జీవితాన్ని హుందాగా గౌరవంగా గడిపానని, ఈ జీవితం తనకు పాఠాలు నేర్పిందని దత్ అన్నారు.
తాను జైలులో ఉన్న సమయంలో ఆధ్యాత్మికంగా గడిపానని, చట్టంపై పుస్తకాలు చదివానని సంజయ్ దత్ తెలిపారు. తనకు జైలు జీవితం పెద్ద గుణపాఠం అని అన్నారు. చాలా మంది ఎలాంటి తప్పు చేయకుండా జైలు జీవితం గడుపుతున్నారని తెలుసుకున్నానని కూడా తెలిపాడు. సాటి ఖైదీలతో కలిసి కొన్ని స్క్రిప్టులు తయారు చేసుకుని తాను డ్రామాలకు దర్శకత్వం వహించానని కూడా వెల్లడించాడు. తాను తప్పు చేసానని పోలీసులు నిరూపించలేకపోయారని, కానీ ఈ కేసు విచారణకు పాతికేళ్లు ఎందుకు పట్టిందో అర్థం కాలేదని కూడా దత్ అన్నారు.




చిరు తో వెంకీ డీల్ క్లోజ్ 
Loading..