Advertisementt

చిరు తో వెంకీ డీల్ క్లోజ్

Wed 03rd Dec 2025 09:09 PM
venkatesh  చిరు తో వెంకీ డీల్ క్లోజ్
Venkatesh wraps Mana Shankar Vara Prasad Garu చిరు తో వెంకీ డీల్ క్లోజ్
Advertisement
Ads by CJ

హీరో వెంకటేష్ మన శంకర వర ప్రసాద్ గారు లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయిందని తెలియజేస్తూ.. సోషల్‌ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టారు.

మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కోసం నా భాగం ఈరోజుతో పూర్తయ్యింది. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం! నాకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి’ గారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయనతో స్క్రీన్‌ షేర్ చేసుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూశాను. ఆ అవకాశాన్ని ఈ ప్రత్యేకమైన సినిమాతో ఇచ్చినందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు .మనం అందరం కలిసి 2026 సంక్రాంతిని థియేటర్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేద్దాం.. అంటూ ట్వీట్ చేసారు. 

విక్టరీ వెంకటేష్ పోస్ట్ కి మెగాస్టార్ చిరంజీవి రిప్లయ్ ఇస్తూ ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు.

మై డియర్ వెంకీ… మై బ్రదర్

మనిద్దరం కలిసి పనిచేసిన ఈ  పది రోజులు నాకు మెమరబుల్. నీతో గడిపిన ప్రతి క్షణం ఆనందంతో, ఎనర్జీతో నిండిపోయింది. మన శంకరవర ప్రసాద్ గారు చిత్రానికి నువ్వు ఇచ్చిన ప్రత్యేకమైన ప్రజెన్స్ అబ్బురపరిచింది. నీతో గడిపిన ప్రతి క్షణం ఎంతో ఆనందం కలిగించింది.

విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి పోస్టులుని కోట్ చేస్తూ తన ఆనందాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ అనిల్ రావిపూడి పోస్ట్ పెట్టారు.  

కొన్ని కలలు మన మనసులో సంవత్సరాల పాటు దాగి ఉంటాయి. అకస్మాత్తుగా సినిమా అలాంటి కలలను నిజం చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారితోపక్కపక్కన నిలబడి, కలిసి నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ, వారి ప్రత్యేకమైన చార్మ్‌తో మెరిసిన ఆ క్షణం…నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందం ఇచ్చింది. నా ప్రయాణంలో ఇది ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.

#ManaShankaraVaraPrasadGaru కోసం తన పార్ట్ ని పూర్తిచేసి, ఈ అందమైన కలను సాకారం చేసిన డియర్ వెంకీ సర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.. అంటూ రిప్లై ఇచ్చారు. 

 

 

Venkatesh wraps Mana Shankar Vara Prasad Garu:

Mana Shankar Vara Prasad Garu: Venky lovely message for Chiru

Tags:   VENKATESH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ