టికెట్ రేట్లు పెంచేసి సినిమాలు చూడమంటే ఎలా అంటూ సామాన్య ప్రేక్షకులే కాదు సీపీఐ నారాయణ కూడా ప్రశ్నిస్తున్నారు. ఐబొమ్మ రవి ని అరెస్ట్ చేసారు. అతని వలన ఎంతోమంది ప్రేక్షకులు ఉచితంగా సినిమా చూసారు. థియేటర్స్ లో ఫుడ్ ఛార్జ్ లు, టికెట్ రేట్లు అధికం ఇలా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే జేబులకు చిల్లే. అందుకే ఐబొమ్మ రవి పైరసీని అందరూ ప్రోత్సహిస్తున్నారు. అతని అరెస్ట్ ని అందరూ ఖండిస్తున్నారు.
ఆఖరికి రాజకీయ నేత సిపిఐ నారాయణ కూడా నేను ఐబొమ్మ లో సినిమా చూసాను, ఐదారొందలు పెట్టి థియేటర్ కి వెళ్లి సినిమాలు ఎవరు చూస్తారు. సినిమా విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచేస్తే థియేటర్ కి వెళ్లి సినిమా ఎందుకు చూస్తారు, అందుకే ఐబొమ్మ రవిలు పుడతారని కామెంట్స్ చేసి ఆయన మరోసారి అఖండ 2 టికెట్ రేట్ల పెంపు విషయంలో హాట్ కామెంట్స్ చేసారు.
అఖండ2 సినిమా టికెట్ రేట్లు పెంచారు.. ఇలా రేట్లు పెంచడం వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది, ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను అరెస్ట్ చేసే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు, సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రజలపై భారం వేసి, సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ, సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు అంటూ అఖండ 2 టికెట్ రేట్లపై నారాయణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.




BB9: భరణి రాక్స్- డిమోన్ పవన్ షాక్స్ 
Loading..