దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన అమీర్ ఖాన్ భారతదేశంలో అసాధారణ స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్నారు. హిందూ- ముస్లిమ్ అనే తేడా లేకుండా దేశంలోని ప్రజలంతా అమీర్ ని అభిమానిస్తారు. కానీ అతడు వీలున్న ప్రతిసారీ హిందూ మతాన్ని కించపరిచేందుకు వెనకాడలేదు. అతడు తన మూలాల నుంచి ఆలోచించి చివరికి హిందూ దేశాన్ని అవమానిస్తున్నాడని చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడు మరోసారి అమీర్ ఖాన్ హిందూ సనాతన ధర్మాన్ని అవమానించాడు! అంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడు కియరా అద్వాణీతో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఏయు బ్యాంక్ కి సంబంధించిన ఈ ప్రకటనలో సాంప్రదాయానికి వ్యతిరేకంగా అతడు కనిపించాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం.. వధువు పెళ్లి తరవాత వరుడి ఇంటికి వెళుతుంది. కానీ వరుడు వధువు ఇంటికి వెళ్లి సెటిలయ్యాడు. ఈ వాణిజ్య ప్రకటనను చూడగానే నెటిజనులు టూమచ్ గా స్పందించారు. అమీర్ ఖాన్ మరోసారి హిందూ మతంపై గొడ్డలి వేటు వేసాడు! అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమీర్ ఖాన్‌ని, ఏయు బ్యాంక్ ని కూడా దేశం నుంచి బహిష్కరించాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
హిందూ దేవుళ్లను కించపరచడం అమీర్ ఖాన్ కి కొత్తేమీ కాదు. ఇంతకుముందు పీకే చిత్రంలోను అతడు హిందూ దేవుళ్లను అవమానించాడు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అమీర్ ఖాన్ ని బహిష్కరించాలని ప్రజలు పిలుపునిచ్చారు.




ఆంధ్ర లో అఖండ 2 కు బంపర్ ఆఫర్ 
Loading..