Advertisementt

అందాల బరువు-మోయలేకపోతున్న హీరోయిన్

Wed 03rd Dec 2025 10:17 AM
samyuktha  అందాల బరువు-మోయలేకపోతున్న హీరోయిన్
Samyuktha Menon glamour show in Akhanda 2 అందాల బరువు-మోయలేకపోతున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన సంయుక్త మీనన్ అఖండ 2 తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలయ్య సరసన డ్యూయెట్ తో అఖండ 2లో గ్లామర్ గా రెచ్చిపోయిన సంయుక్త ను చూసి అందరూ షాకయ్యారు. అంతలాంటి గ్లామర్ షో ఆ సాంగ్ లోనే కాదు ఆమె అఖండ 2 తాండవం ప్రమోషన్స్ లోను అంతే అందాలు చూపిస్తుంది.

అయితే సంయుక్త మీనన్ ఎప్పుడు స్లిమ్ గా లేదు. ఆమె విరూపాక్షలోనూ కాస్త బరువుగానే కనిపించినా.. ప్రస్తుతం సంయుక్త మీనన్ వెయిట్ పెరిగి ఆమె అందాల బరువు మోయలేకపోతుందా అన్నట్టుగా కనిపిస్తుంది ఆమె గ్లామర్ షో. ప్రస్తుతం అవకాశాలు బరువును కూడా సంయుక్త గట్టిగానే మోస్తుంది.

టాలీవుడ్ హీరోలందరితో చుట్టేసేలా కనిపిస్తుంది. రీసెంట్ గా పూరి-విజయ్ సేతుపతి మూవీ షూటింగ్ ముగించేసింది. ఈ చిత్రం మాత్రమే కాదు నిఖిల్ తో స్వయంభు, బెల్లంకొండ శ్రీనివాస్ తో హైందవ, శర్వానంద్ తో నారి నారి నడుముమరారి చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అంతేకాకుండా తమిళంలో రాఘవ లారెన్స్ బెంజ్, ముఖ్యంగా బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. హిందీలో మహారాణి చిత్రంలో నటిస్తుంది. అటు అవకాశాలు ఇటు అందాల బరువుతో సంయుక్త మీనన్ చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. మరి అఖండ 2 హిట్ అయితే అమ్మడు పేరు మరింతగా మోగిపోతుంది. 

Samyuktha Menon glamour show in Akhanda 2:

Samyuktha Menon Glamorous Look Shines at Akhanda 2 

Tags:   SAMYUKTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ