Advertisementt

ఆంధ్ర లో అఖండ 2 కు బంపర్ ఆఫర్

Tue 02nd Dec 2025 10:02 PM
akhanda 2  ఆంధ్ర లో అఖండ 2 కు బంపర్ ఆఫర్
Akhanda 2 gets a boost in AP ఆంధ్ర లో అఖండ 2 కు బంపర్ ఆఫర్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పాన్ ఇండియా మాస్ ఆడియన్స్ అఖండ 2 ఫీవర్ తో కనిపిస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సింహగర్జన ఎలా ఉంటుందో చూస్తారా అంటూ అఖండ 2 తాండవంతో రేపు శుక్రవారమే రాబోతున్నారు. మొట్టమొదటిసారి బాలయ్య పాన్ ఇండియా మర్కెట్ ని టచ్ చెయ్యబోతున్నారు. 

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న అఖండ తాండవానికి భీబత్సమైన క్రేజ్ ఉంది, దానితో ఓపెనింగ్స్ రోజు అఖండ 2 రికార్డ్ లు కొల్లగొట్టడం ఖాయమనుకుంటున్నారు అందరూ.. దానికి బోనస్ ఇస్తూ ఏపీ గవర్నమెంట్ అఖండ 2కి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాదు ప్రీమియర్స్ షోస్ కి కూడా అనుమతులిచ్చేసింది. 

డిసెంబర్ 4న ప్రీమియర్ షో వేసుకోవడానికి అలాగే దానికి టికెట్ ధరను నిర్ణయిస్తూ.. రూ 600 ప్రీమియర్ షో టికెట్ రేట్ ని ఫిక్స్ చేసారు, డిసెంబర్ 5 నుంచి మల్టీప్లెక్స్ లో రూ.100 రూపాయలు, సింగిల్ థియేటర్ లో రూ.75 రూపాయలు పెంపుకు అనుమతులిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ జారీ చేసింది. 

Akhanda 2 gets a boost in AP:

AP govt allows ticket hike for Akhanda2

Tags:   AKHANDA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ