Advertisementt

కాంతార కాంట్రవర్సీ - సారీ చెప్పిన రణ్వీర్

Tue 02nd Dec 2025 04:08 PM
ranveer singh  కాంతార కాంట్రవర్సీ - సారీ చెప్పిన రణ్వీర్
Ranveer Singh Apologized for the Kantara Incident కాంతార కాంట్రవర్సీ - సారీ చెప్పిన రణ్వీర్
Advertisement
Ads by CJ

కన్నడ కాంతార సినిమా విషయంలో రిషబ్ శెట్టి ని అనుకరించే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ గోవా ఫిలిం ఫెస్టివల్ లో చేసిన కామెంట్స్ కన్నడిగుల ఆగ్రహానికి గురి చేసాయి. రణ్వీర్ సింగ్ క్షమాపణ చెప్పాలంటూ కన్నడ ప్రజలు డిమాండ్ చేసారు. ఆ ఈవెంట్ వేదికపై హోస్ట్ గా చేసిన రణ్వీర్ సింగ్, మట్లాడుతూ.. కాంతార 2 సినిమాలో రిషబ్ శెట్టి అద్భుతంగా నటించారని మెచ్చుకున్న రణ్వీర్ కాంతార క్లైమాక్స్ లో హీరో పాత్రలోకి ఆడ దెయ్యం ప్రవేశించినప్పుడు వచ్చే సీన్స్ చాలా బాగున్నాయని చెప్పాడు. 

ఆ క్రమంలోనే రిషబ్ శెట్టి ని ఇమిటేట్ చేస్తూ.. స్టేజ్‌పై మెల్ల కన్ను పెట్టి, కాంతార మాదిరిగా ఓ... అంటూ సౌండ్ చేశాడు. తమకు ఎంతో ఇష్టమైన దైవాన్ని రణ్వీర్ కించపరిచాడంటూ కన్నడ ప్రజలు ఫైర్ అయ్యారు. పరిస్థితి చేదాటడంతో ఈ కాంట్రవర్సీకి రణ్వీర్ క్షమాపణలతో ఫుల్ టాప్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా.. 

కాంతార లో రిషబ్ శెట్టి అద్భుతమైన నటన కనబరిచారనేది చెప్పడమే నా ఉద్దేశ్యం. రిషబ్ యాక్ట్  చేసిన ఆ ప్రత్యేక సన్నివేశాన్ని అదే విధంగా రీ క్రియేట్ చెయ్యడం ఎంత కష్టమో ఒక నటుడిగా నాకు తెలుసు. నాకు రిషబ్ అంటే నాకు చాలా అభిమానం. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలను నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నా వ్యాఖ్యలు నేను ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే, నేను వారికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను అంటూ రాసుకొచ్చారు. 

Ranveer Singh Apologized for the Kantara Incident :

Ranveer Singh breaks silence on Kantara row: I sincerely apologise

Tags:   RANVEER SINGH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ