తెలుగు, తమిళ భాషల్లో హీరోకుండే క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అభిమానంతో ఆరాదిస్తారు. పాలా భిషేకం.. రక్తాభిషేకాలు కూడా చేస్తుంటారు. అభిమానం హద్దు మీరిన సందర్బాల్లో ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. ఆ రకంగా తెలుగు హీరోలు ఎంతో అదృష్ట వంతులు. దేశంలో ఇంకే భాషకు ఈ రేంజ్ లో అభిమానం దక్కదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ హీరోలకు అభిమానులుంటారు. కానీ అక్కడ అభిమానం అన్నది హద్దుల్లో ఉం టుంది.
అభిమానం పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకోరు. కాస్త హుందాగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా హిందీ పరిశ్రమలో హీరోకి ఎలాంటి ఐడెంటిటీ ఉంటుందన్నది వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా దుల్కార్ సల్మాన్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. హిదీలో నటించేటప్పుడు పెద్ద స్టార్ అని అనిపించుకోకపోతే అక్కడ వాళ్లంతా నిర్లక్ష్యం చేస్తారన్నాడు. దుల్కర్ బాలీవుడ్ లో నటించేటప్పుడు చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఉండేవారుట.
తాను స్టార్ అని ముందుగా ఆ ఇద్దర్నీ నమ్మించాలిట. లేకపోతే కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా వేయరన్నాడు. సీన్ లో నటించిన తర్వాత మోనిటర్ లో దాన్ని చూడటానికి వెళ్లే స్థలం కూడా ఇవ్వరన్నాడు. చుట్టూ జనాలు ఉంటేనే వాళ్లు గుర్తిస్తారు. లగ్జరీ కారులో వెళ్తేనే మనల్ని గుర్తిస్తారు. లేదంటే పట్టించుకునే పరిస్థితి ఉండదు. అలాంటి భావన హిందీ పరిశ్రమలో ఉండటం దురదృష్ట కరం అన్నాడు. మలయాళ సెట్ లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుందన్నాడు.
అక్కడ లగ్జరీకి..ఆడంబరానికి ప్రాధాన్యత ఇవ్వరు. రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. కావాల్సినవ్నీ ఇంటి నుంచే తెచ్చుకుంటాం. వీలైనంత వరకూ సొంత ఖర్చులే పెట్టుకుంటాం. నిర్మాతపై అదనపు భారం ఉండ నివ్వం అన్నాడు. దుల్కార్ సల్మాన్ ఖాన్ కోలీవుడ్, టాలీవుడ్ లో కూడా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇక్కడ దర్శక, నిర్మాతలతోనూ పనిచేసాడు. మరి ఇక్కడ ఆన్ సెట్స్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది కూడా చెబితే బాగుండేది.




చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న మృణాల్ 
Loading..