ఈమధ్యన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ పై బోలెడన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోలీవుడ్ హీరో ధనుష్ తో మృణాల్ ఠాకూర్ సీక్రెట్ డేటింగ్ చేస్తుంది అనే వార్తలు మాములుగా వైరల్ అవ్వలేదు. వారిద్దరూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టుకున్నా అదో సంచలనమే అయ్యింది.
తాజాగా ధనుష్ తో డేటింగ్ వార్తలపై మృణాల్ ఠాకూర్ సరదాగా రియాక్ట్ అయ్యింది. ధనుష్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని, అయినా తను ఈ డేటింగ్ రూమర్స్ ను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను అంటూ వాటికి సింపుల్ గా ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే మృణాల్ ఠాకూర్ తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే.
మంచి డిజైనర్ శారీ లో మృణాల్ ఠాకూర్ చాలా ట్రెడిషనల్ గా బుట్ట బొమ్మలా మెస్మరైజ్ చేసింది. చెవులకు పెద్ద పెద్ద జుంకీలతో చాల ఇన్నోసెంట్ ఫేస్ తో మృణాల్ ఠాకూర్ బ్యూటిఫుల్ గా కనిపించింది. ఆమె అభిమానులు కూడా అదే అంటున్నారు.. మృణాల్ నువ్వు సూపర్ అని.




ఈ సంక్రాంతి మాస్ ఆడియన్స్ కు చప్పగానే
Loading..