Advertisementt

న‌టుడి ఇంట్లో ఆస్తుల త‌గాదా

Tue 02nd Dec 2025 09:28 AM
dharmendra  న‌టుడి ఇంట్లో ఆస్తుల త‌గాదా
Property aspect of Dharmendra families న‌టుడి ఇంట్లో ఆస్తుల త‌గాదా
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు ధ‌ర్మేంద్ర 89 వ‌య‌సులో వ‌య‌సు సంబంధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత అతడి వార‌సుల మ‌ధ్య ఆస్తుల త‌గాదా మొద‌లైంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌న‌కు 450 కోట్ల మేర నిక‌ర ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల వార‌స‌త్వం గురించి మొద‌టి భార్య ప్ర‌కాష్ కౌర్ కొడుకులైన స‌న్నీడియోల్- బాబిడియోల్ తో, హేమ‌మాలిని- ధ‌ర్మేంద్ర‌ల‌ కుమార్తెలు ఈషా డియోల్, అహ‌నా డియోల్ ఫైట్ చేస్తారంటూ ప్ర‌చారం సాగుతోంది.

ధ‌ర్మేంద్ర త‌న కుమార్తెల‌కు న్యాయ‌బ‌ద్ధంగా ఆస్తులు రాసిచ్చి మ‌ర‌ణించాడ‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తుంటే, ఆ కుటుంబంలో ఆస్తుల వివాదం మొద‌ల‌వుతుంద‌ని మ‌రికొంద‌రు చాలా మంది నెటిజ‌నులు ఊహిస్తున్నారు. దీనికి కార‌ణం ధ‌ర్మేంద్ర మ‌ర‌ణానంత‌రం ఇరు కుటుంబాలు వేర్వేరుగా సంతాప‌, సంస్మ‌ర‌ణ స‌భ‌లు నిర్వ‌హించ‌డ‌మే. హేమ‌మాలిని త‌న ఇంట్లోనే సంతాప స‌భ‌ను నిర్వ‌హించ‌గా, స‌న్నీడియోల్- బాబి డియోలో ఒక ప్ర‌యివేట్ హోట‌ల్ లో సంతాప స‌భ‌ను నిర్వ‌హించారు. తండ్రి సంస్మ‌ర‌ణ స‌భ‌ను క‌లిసి నిర్వ‌హించ‌క‌పోవ‌డం విభ‌జ‌న‌పై ఊహాగానాల‌కు తావిచ్చింది.

అయితే స‌న్నీ-బాబి త‌మ చెల్లెళ్లు అయిన ఈషా- అహ‌నాల‌ను విడిచిపెట్ట‌ర‌ని వారంతా ఒకే కుటుంబంగా క‌లిసి ఉంటార‌ని కొంద‌రు నెటిజ‌నులు వాదిస్తున్నారు. అన్నా చెల్లెళ్ల మ‌ధ్య ఆస్తుల త‌గాదాలు ఉండ‌వ‌ని అంటున్నారు. ధ‌ర్మేంద్ర త‌న మొద‌టి భార్య ప్ర‌కాష్ కౌర్ కి విడాకులు ఇవ్వ‌లేదు.. అందువ‌ల్ల హేమ‌మాలిని చ‌ట్ట‌బ‌ద్ధంగా భార్య కాదు గ‌నుక ఆస్తుల్లో ఈషా-అహ‌నా డియోల్ సిస్ట‌ర్స్ వాటాను కోర‌లేర‌ని కూడా క‌థనాలొస్తున్నాయి.

అయితే ఇంకా ధ‌ర్మేంద్ర మ‌రణించిన బాధ‌లో వారంతా ఉన్నారు. ఇప్పుడే దీని గురించి మాట్లాడ‌టం స‌రికాద‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఇవ‌న్నీ ఊహాగానాలు మాత్ర‌మే. ఇందులో నిజాలు ఏమిట‌న్నది స్ప‌ష్ఠంగా తెలియాల్సి ఉంది.

Property aspect of Dharmendra families:

Dispute Brewing In Deol Family Over Inheritance Of Dharmendra Wealth

Tags:   DHARMENDRA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ