విశ్వనటుడు కమల్ హాసన్ దాదాపు 50 ఏళ్లుగా అలుపన్నదే లేకుండా నటనలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 71 ఏళ్ల కమల్ హాసన్ చాలా కాలం తర్వాత తన వృత్తి నుంచి విరమించే ఆలోచన గురించి మాట్లాడారు. తాను కూడా పదవీ విరమణ గురించి ఆలోచిస్తానని అన్నారు. అయితే ఏదైనా మంచి సినిమా చేసిన తర్వాత విరమించాలని నా అభిమానులు కోరుతున్నారు. నేను ఇప్పటికీ అలాంటి మంచి సినిమా గురించి వెతుకుతున్నానని అన్నారు. అంతేకాదు.. తాను విరమించాలని అడగడం కొందరి పని మాత్రమేనని సరదాగా వ్యాఖ్యానించారు.
అలాగే తనకు 71 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని, దీనికి ఎంతో గర్విస్తున్నానని అన్నారు కమల్ హాసన్. ఇటీవల రాజ్యసభ ఎంపీగా పదవి వరించినప్పుడు సభకు వెళ్లి సంతకం చేసానని, వారు రోజువారీ వేతనం ఇవ్వగానే తన అమ్మా నాన్న శ్రీనివాస్ అయ్యంగార్ - రాజ్యలక్ష్మిలకు ఈ విషయం చెప్పాలనుకున్నానని కమల్ హాసన్ అన్నారు. తన తల్లి తనకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని కలలు కన్నట్టు చెప్పారు. ఒకవేళ ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేసి ఉంటే తనకు రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదని తన తల్లి తనతో అన్నట్టు గుర్తు చేసుకున్నారు. కేరళలో ఆర్ట్ అండ్ లిటరేచర్ పై జరిగిన సమావేశంలో కమల్ పైవిధంగా వ్యాఖ్యానించారు.
మంజు వారియర్ తో కలిసి కమల్ ఈ వేదికపై డిబేట్ ని కొనసాగించారు. కమల్ హాసన్ నటించిన చివరి చిత్ర థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. తదుపరి కల్కి 2898 ఏడి లో కమల్ నటిస్తారు. లోకేష్ కనగరాజ్ తో విక్రమ్ 2 కూడా పట్టాలెక్కేందుకు అవకాశం ఉంది. మరోవైపు రజనీకాంత్ కథానాయకుడిగా ఓ సినిమాని కమల్ హాసన్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడిని ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. కమల్ దూకుడు చూస్తుంటే అతడిని 100ఏళ్లు పూర్తయ్యే వరకూ ఆపడం కష్టమే.




నటుడి ఇంట్లో ఆస్తుల తగాదా
Loading..