Advertisementt

ఐ బొమ్మ రవిని హీరోని చేసారు-నాగవంశీ

Mon 01st Dec 2025 08:59 PM
ravi  ఐ బొమ్మ రవిని హీరోని చేసారు-నాగవంశీ
Naga Vamsi Comments on iBomma Ravi ఐ బొమ్మ రవిని హీరోని చేసారు-నాగవంశీ
Advertisement
Ads by CJ

పైరసీ తో సినిమా ఇండస్ట్రీ ని పరుగులు పెట్టించిన ఐ బొమ్మ రవి ఎట్టకేలకు తెలంగాణ పోలిసుల చేతులకు చిక్కి విచారణ ఎదుర్కొంటున్నాడు. రవి అరెస్ట్ ను సామాన్య ప్రేక్షకులే కాదు చాలామంది బడా నేతలు కూడా ఖండించారు. చాలామంది పైరసీ ఆడియన్స్ ఐ బొమ్మ రవి అరెస్ట్ ను ఖండించారు. సినిమా థియేటర్స్ లో టికెట్ రేట్స్ పెంచేసి అధిక ధరలకు పాప్ కార్న్ కొనుక్కుని సినిమా చూడమంటే ఎవరు చూస్తారు, రవి తప్పు చేసినా మాకు మేలు చేశాడంటూ రవి పై సానుభూతిని చూపించడమే కాదు.. 

భారీ బడ్జెట్ పెట్టి ఎవరు సినిమా తియ్యమన్నారు, ఎవరు టికెట్ రేట్లు పెంచమన్నారు అంటూనే అందరూ కలిసి ఐబొమ్మ రవి ని రాబిన్ హుడ్ ని చేసారు. దానితో సినిమా పెద్దలే అవాక్కవ్వాల్సి వచ్చింది. 

తాజాగా నిర్మాత నాగవంశీ ఐ బొమ్మ రవి పై సంచలన కామెంట్స్ చేసారు. అందరూ కలిసి ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్ చేశారు. ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్ ని చేసిన లోకంలో ఉన్నాం. 90sకి దీనికి ఏం పోలిక. రూ.50 టికెట్ రేటు పెంచితే మేమేదో తప్పు చేసినోళ్లం అయ్యాం. ఆ అబ్బాయి హీరో అయిపోయాడు.

అలాంటి సొసైటీలో ఉంటూ తప్పేం జరిగింది అంటారేంటండి అంటూ నాగవంశీ ఎపిక్ మూవీ ప్రెస్ మీట్ లో ఫైర్ అవడం సంచలనంగా మారింది. 

Naga Vamsi Comments on iBomma Ravi:

Producer Naga Vamsi Comments on iBomma Ravi

Tags:   RAVI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ