హీరో రామ్ పోతినేని కొన్నేళ్లుగా అంటే ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. స్టైలిష్ లుక్స్, స్టైలిష్ డాన్స్ ఇలా అన్ని బావున్నా రామ్ కి దర్శకులు సరైన హిట్ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు మహేష్ పి దర్శకత్వంలో రామ్ చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం గత గురువారం విడుదలైంది.
ఆంధ్ర కింగ్ తాలూకా విడుదలైన మొదటి రోజు ఆడియన్స్ ఆహా ఓహో అన్నారు, క్రిటిక్స్ కూడా అదిరిపోయే రివ్యూస్ ఇచ్చారు. ఇంకేంటి ఇస్మార్ట్ తర్వాత ఆ మాదిరి హిట్ ఆంధ్ర కింగ్ తాలూకా తో రామ్ కొట్టాడు, ఈ విజయాన్ని అమెరికా వెళ్లి అక్కడి అభిమానులతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడని అన్నారు, తీరా చూస్తే ఆంధ్ర కింగ్ తాలూకా కి అనుకున్నంత రెస్పాన్స్ అయితే బయట కనిపించడం లేదు.
రెస్పాన్స్ అంటే అదిరిపోయే కలెక్షన్స్ ఆంధ్ర కింగ్ తాలూకా తెచ్చినట్టుగా మేకర్స్ అనౌన్స్ చెయ్యలేదు. ఇదేనా రామ్ కోరుకున్నది, వీకెండ్ ముగిసింది. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూక అసలు పరిక్ష ఎదుర్కొంటుంది.
ఈ హిట్ కే రామ్ పొంగిపోవాలా అనేది ఇప్పుడు ఆయన అభిమానుల ముందున్న పెద్ద ప్రశ్న. చూద్దాం ఆంధ్ర కింగ్ తాలూకా కలెక్షన్స్ ఫైనల్ లెక్క ఏమిటి అనేది.




అఖిల్ లెనిన్ కి తప్పని తిప్పలు 
Loading..