బిగ్ బాస్ సీజన్ 9 లో సెలెబ్రిటీ హోదాలో ఎంటర్ అయిన సంజన హౌస్ లో దొంగతనాలు చేస్తూ హైలెట్ అయ్యింది. అయితే నామినేషన్స్ లో సంజన ట్రిగ్గర్ అయ్యి కంటెస్టెంట్స్ ని పర్సనల్ గా టార్గెట్ చేస్తుంది. టాస్క్ లు ఆడలేదు, అలాగని హౌస్ లో పని చెయ్యదు, కానీ కంటెంట్ ఇవ్వడంలో సంజన ఆరితేరిపోయింది.
12 వ వారం నామినేషన్స్ లో రీతూ తనని నామినేట్ చేసింది అని ఆమెను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ పవన్ తో రీతూ తిరగడం నచ్చలేదు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. రీతూ ని డీ గ్రేడ్ చేస్తూ మాట్లాడిన సంజనను శనివారం ఎపిసోడ్ లో నాగార్జున వాయించేసారు. అంతేకాదు నీకు అన్ కంఫర్టుబుల్ గా ఉంటే బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చెయ్యండి ఆమె వెళ్ళిపోతుంది అన్నారు. దానితో సంజన సర్ నేను చాలా కష్టపడి ఇక్కడివరకు వచ్చాను వెళ్ళను అంది.
దానితో నాగార్జన నువ్వు హౌస్ లో ఉండాలంటే నీ కోసం త్యాగం చేసిన ఇమ్మాన్యుయేల్, తనూజ, రీతూ, భరణి చెప్పాలి అనగానే సర్ నేను ఉండను వెళ్ళిపోతాను, నాకు వారు త్యాగం చేశాను అంటూ గుచ్చుతారు, అందుకే నేను హౌస్ లో ఉండను వెళ్ళిపోతానంటూ నాగార్జునని బ్లాక్ మెయిల్ చేసింది. ఈ ట్విస్ట్ కి నాగార్జున కూడా షాక్ అయ్యి సంజన ఈసారి డెసిషన్ నీ చేతుల్లో లేదు, నీ కోసం త్యాగం చేసిన వాళ్ళ చేతుల్లో ఉంది అనాల్సి వచ్చింది.
ఇమ్ము, భరణి, తనూజ, రీతూ లు సంజనను సారీ చెప్పి హౌస్ లో ఉండమంటే నేను ఉండను సర్, వెళ్ళిపోతానంటూ ఒకటే గొడవ చేసింది, ఆమెను హౌస్ లో ఉంచడానికి నాగార్జున పడిన పాట్లు అన్ని ఇన్ని కావు, ఆఖరికి నాగార్జున అటు తిప్పి ఇటు తిప్పి అడుక్కున్నంత పని చేసి సంజన తో సారీ చెప్పించి హౌస్ లో ఉండేలా చేసారు. ఆ ఎపిసోడ్ చూసాక నాగార్జున నే బ్లాక్ మెయిల్ చేసిన సంజన ఏమాడింది గేమ్ అంటూ నెటిజెన్లు మాట్లాడుకుంటున్నారు.




అఖిల్ లెనిన్ ఇలా అయితే కష్టం
Loading..