నిత్యం వార్తల్లో నిలిచే సినిమాకే ఆడియన్స్ లో క్రేజ్ ఉంటుంది. అందుకే చాలామంది మేకర్స్ తమ సినిమాల అప్ డేట్స్ ని ఏదో విధంగా వదులుతూనే ఉంటారు. వారు నేరుగా అప్ డేట్ ఇవ్వకపోయినా వారికిష్టమైన వారి చేత సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ట్వీట్లు వేయించి అభిమానులను అలెర్ట్ చేస్తూ ఉంటారు.
మరి ఇలాంటి సమయంలో అఖిల్ లెనిన్ మూవీ అప్ డేట్ ఇవ్వకుండా కామ్ గా షూటింగ్ చేసుకోవడం అక్కినేని అభిమానులను కలవరపెడుతుంది. మురళి కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. శ్రీలీల హీరోయిన్. అఖిల్ బర్త్ డే కి వదిలిన లెనిన్ గ్లింప్స్ ఫ్యాన్స్ ను శాటిస్ఫాయ్ చేసాయి.
ఆతర్వాత లెనిన్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ మధ్యలో అఖిల్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు కావడం, ఆ తర్వాత లెనిన్ షూటింగ్ లో పాల్గొనడం చేస్తున్నా, అసలు లెనిన్ షూటింగ్ ఎక్కడివరకు వచ్చింది, రిలీజ్ ఎప్పుడు ఇవేమి చెప్పకుండా మేకర్స్ సైలెంట్ గా ఉన్నారు. అదే అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండే సినిమాలకే క్రేజ్ ఉంటుంది కానీ ఇలా అయితే కష్టమంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజెన్స్.





Loading..