చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో మోసపోయి ప్రాణాలు తీసుకుంటారు, అంతేకాదు తమ ప్రేమ సఫలం కాకపోయినా, పెద్దల వలన ఇబ్బందులు పడి ఆత్మహత్యలకు పాల్పడతారు, మరికొందరు పరువు హత్యలు చేస్తారు. మరికొందరు అమ్మాయిల చేతిలో మోసపోయి ప్రాణాలు వదులుతారు, అబ్బాయి మోసం చేశాడంటూ అమ్మాయిలు ధర్నాలు చేస్తారు.
ఇక్కడ మాత్రం ప్రేమించిన అమ్మాయి కోసం సముద్రాలు దాటి వచ్చి.. ఇక్కడ ఆ అమ్మాయి మరొకరిని వివాహం చేసుకుంది అని తెలిసి ప్రాణం తీసుకున్న యువకుడు కథ చూస్తే నిజంగా కన్నీళ్లు ఆగవు. నిజామాబాద్ జిల్లా దొంచందకు చెందిన శ్రీకాంత్ రెడ్డి, ఏరుగట్లకు చెందిన అఖిల గత ఆరేళ్లుగా ప్రేమించుకోవడమే కాదు ఏంతో ప్రేమగా ఉంటూ వస్తున్నారు.
శ్రీకాంత్ రెడ్డి ఉద్యోగం రీత్యా లండన్ లో ఉంటున్నాడు. అతను అఖిల్ ను వివాహం చేసుకునేందుకు లండన్ నుంచి వచ్చాడు. ఇక్కడికొచ్చి చూసేసరికి అఖిల తండ్రి ఆమెకు అప్పటికే మరో అబ్బాయిని ఇచ్చి పెళ్లి జరిపించాడు. దానితో తీవ్ర తీవ్ర మనస్థాపానికి గురైన ప్రియుడు శ్రీకాంత్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
శ్రీకాంత్ కుటుంబ సభ్యులు శ్రీకాంత్ పురుగులు మందు తగిన విషయాన్ని గుర్తించి వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. కానీ చికిత్స పొందుతూ శ్రీకాంత్ రెడ్డి మరణించడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కలిచివేసింది.




లోకేష్ ని ఎలా నమ్మవయ్యా..
Loading..