తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అంటే కూలి కి ముందు సౌత్ అండ్ నార్త్ హీరోలకు విపరీతమైన క్రేజ్. లోకేష్ కనగరాజ్ తో సినిమా చేసేందుకు టాప్ పాన్ ఇండియా స్టార్స్ ఉత్సాహం చూపించారు. కూలి దెబ్బకు లోకేష్ కనగరాజ్ పై అందరిలో ఓ విధమైన అనుమానం స్టార్ట్ అయ్యింది. కూలి తర్వాత లోకేష్ కనగరాజ్ మొదలు పెట్టబోయే మూవీ పై అందరిలో ఆసక్తి ఉంది.
తాజాగా లోకేష్ కనగరాజ్ తో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కనెక్ట్ అయ్యాడనే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ AA 22 ని చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. అట్లీ తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చెప్పిన పవర్ ఫుల్ కథకు తో కనెక్ట్ అవుతున్నారట.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్ లో సర్కులేట్ అవుతుంది. లోకేష్ యాక్షన్ డిజైన్, బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే భారీ విజువల్ ఫైర్‌వర్క్స్‌గా మారనున్నాయనే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొంతమంది లోకేష్ ని ఎలా నమ్మవయ్యా బన్నీ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.




స్పిరిట్-యాక్షన్ మోడ్ లో ప్రభాస్ 
Loading..