Advertisementt

స్పిరిట్-యాక్షన్ మోడ్ లో ప్రభాస్

Fri 28th Nov 2025 02:38 PM
prabhas   స్పిరిట్-యాక్షన్ మోడ్ లో ప్రభాస్
Prabhas slips into action mode స్పిరిట్-యాక్షన్ మోడ్ లో ప్రభాస్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ ముగించేసి అటు హను రాఘవపూడి తో ఫౌజీ చిత్ర షూటింగ్ లో పాల్గొంటూనే ఇటు మోస్ట్ అవైటెడ్ స్పిరిట్ కోసం లుక్ మార్చేసి సందీప్ వంగ తో స్పిరిట్ షూటింగ్ షురూ చేసారు ప్రభాస్. రీసెంట్ గా మెగాస్టార్ చిరు చేతుల మీదుగా స్పిరిట్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. 

స్పిరిట్ షూటింగ్ నిన్న గురువారం మొదలైంది. హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకున్న స్పిరిట్ సెట్ లోకి ప్రభాస్ గురువారం అడుగు పెట్టారు. సందీప్ వంగ ప్రభాస్ పై ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. స్పెషల్ గా వేసిన ఓ భారీ సెట్లో స్పిరిట్ షూట్ నిర్విరామంగా కొనసాగనుంది. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సరికొత్త లుక్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వబోతున్నారు.  ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ షెడ్యూల్ అవ్వగానే ప్రభాస్ డిసెంబర్ లో జపాన్ వెళ్లనున్నారు. 

Prabhas slips into action mode:

Prabhas intense action in Spirit

Tags:   PRABHAS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ