బాలీవుడ్ క్రేజీ కపుల్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు కొనేళ్లు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన నెక్స్ట్ మినిట్ కియారా అద్వానీ, సిద్దార్థ్ లు ఎవరి షూటింగ్స్ లో వారు బిజీ అయ్యారు. కియారా ఆతర్వాత వరస కమిట్మెంట్స్ తో బిజీగా మారిపోయింది.
అయితే ఈఏడాది కియారా అద్వానీ తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. ఆతర్వాత బేబీ బంప్ తోనే పలు ర్యాంప్ వాక్స్, సినిమా షూటింగ్స్ లో పాల్గొన్న కియారా అద్వానీ కి పండంటి ఆడపిల్ల జన్మించింది. ఆ విషయాన్ని సిద్దార్థ్ మల్హోత్రా - కియారాలు అద్వానీ లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసారు.
తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టా లో తమ కుమార్తె పాదాలను చూపిస్తూ.. తమ కూతురు పేరు కూడా రివీల్ చేసింది కియారా జంట. సరాయా మల్హోత్రా అంటూ తమ కుమార్తె పేరుని రివీల్ చేశారు కియారా-సిద్దార్థ్ లు. ప్రస్తుతం సరాయా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.




ఆ హీరో సినిమా వారానికే ఓటీటీ లోకి
Loading..