పాపం ఇమాన్యుయెల్.. బిగ్ బాస్ సీజన్ 9 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫుల్ ఎంటర్టైనర్ గా హౌస్ మేట్స్ మనసులను గెలుచుకుని 12 వారాల పాటు హోస్ట్ నాగార్జున చేత శెభాష్ అనిపించుకుని బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ కి దగ్గరవుతున్నారు అనుకుంటే.. బయట ఇమ్మాన్యుయేల్ వోటింగ్ లో ఎదురీదుతున్నాడు. టాప్5 లో ఇమ్మాన్యుయేల్ ఫిక్స్ ఇందులో ఎలాంటి అనుమానం లేదు.
కానీ కప్ కోసం ఇమ్మాన్యుయేల్ ఎంత చేసినా వర్కౌట్ అయ్యేలా లేదు. బయట తనూజ, కళ్యాణ్ పడాలా ఫ్యాన్ బేస్ ముందు కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఫ్యాన్ బేస్ దిగదుడుపే. కారణం ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్ లోకి రాకపోవడమే, తనూజ వారం వారం నామినేషన్స్ లోకి రావడం, కళ్యాణ్ తరచూ నామినేషన్స్ లోకి రావడం వారి అట తీరుకి ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఓట్లు వేస్తున్నారు.
కానీ ఇమ్మాన్యుయేల్ ఎంతగా హౌస్ లో పేరు తెచ్చుకున్నా బయట పని జరగడం లేదు, ఇమ్మాన్యుయేల్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆయన అభిమానులు నిజంగానే నిద్రపోతున్నారు. ఇక ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ ని కప్ కి దగ్గర చెయ్యడానికి ఆయన హార్డ్ కొర్ అభిమానులు కష్టపడుతున్నారు.
తనూజ, కళ్యాణ్ పై నెగెటివ్ పోస్ట్ లు పెడుతూ వారి క్రేజ్ తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నారు. మరి ఈ మూడు వారాల్లో ఇమ్మాన్యుయేల్ రేంజ్ ఎంతవరకు పెరుగుతుందో చూడాలి.




ప్రాణం తీసిన ప్రేమ మోసం
Loading..