హీరో రామ్ లేటెస్ట్ చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. మహేష్ పి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రామ్ తో రొమాన్స్ చేసింది. టైటిల్, పోస్టర్స్, ట్రైలర్ ముఖ్యంగా సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యింది. దానితో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈరోజు గురువారం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా ఓవర్సీస్ షోస్ ఇప్పటికే పూర్తయ్యాయి.
దానితో ఆడియన్స్ ఓవర్సీస్ పబ్లిక్ టాక్ అంటూ సోషల్ మీడియాలో ఆంధ్రకింగ్ తాలూకా ట్వీట్ల తో సందడి స్టార్ట్ చేశారు. ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. ఆంధ్రా కింగ్ తాలూకా సూపర్‌హిట్. రామ్ వన్ మ్యాన్ షో, రామ్ కుమ్మేశాడు. రామ్, భాగ్యశ్రీల ఆన్‌స్క్రీన్ కెమెస్ట్రీ అదుర్స్. దర్శకుడు మహేశ్ ప్రతి ఫ్రేమ్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేసాడు.. అంటూ కొంతమంది ఓవర్సీస్ ఆడియన్స్ ట్వీట్ చేస్తున్నారు.
ఆంధ్రా కింగ్ తాలూకా.. ఎమోషనల్, ఎంగేజింగ్ స్టోరీ, దర్శకుడు మహేష్ రాసిన డైలాగులు, రచనా విధానం బాగుంది. పాటలు, సెకండాఫ్ సూపర్. క్లైమాక్స్‌ను అద్భుతంగా చూపించారు, భాగ్యశ్రీ భోర్సేతో రామ్ కెమెస్ట్రీ తెరపై చాలా ఫ్రెష్‌గా, చూసేందుకు అందంగా ఉంది. ఫస్ట్ హాఫ్ స్లో గా ఉండడమే ఈ సినిమాకి మైనస్ తప్ప ఓవరాల్ గా సినిమా గుడ్ అంటూ మరికొందరు ఆడియన్స్ సినిమాపై స్పందిస్తున్నారు.




ఆన్ లైన్ వేధింపులు అంతమే లక్ష్యంగా సమంత
Loading..