Advertisementt

ఆన్ లైన్ వేధింపులు అంత‌మే ల‌క్ష్యంగా స‌మంత‌

Wed 26th Nov 2025 08:00 PM
samantha  ఆన్ లైన్ వేధింపులు అంత‌మే ల‌క్ష్యంగా స‌మంత‌
samantha on online Harassment ఆన్ లైన్ వేధింపులు అంత‌మే ల‌క్ష్యంగా స‌మంత‌
Advertisement
Ads by CJ

డిజిట‌ల్ యుగంలో మ‌హిళ‌లు ఎలాంటి వేధింపుల‌కు గుర‌వుతున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో బాధింప బ‌డ్డ మ‌హిళ‌లు ఎంతో మంది ఉన్నారు. ఆన్ లైన్ వేధింపుల కు సైబ‌ర్ క్రైమ్ నుంచి స‌రైన‌ ర‌క్ష‌ణ కూడా అంద‌డం లేదు. కేసులు ఫైల్ చేయ‌డం వ‌ర‌కే ప‌రిమితం త‌ప్ప‌?  వాటికి ప‌రిష్కారం మాత్రం దొర‌క‌డం లేదు. ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్ల దీయ‌డం త‌ప్ప ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌డం లేదు.

 

తాజాగా  న‌టి స‌మంతా ఆన్ లైన్ వేధింపులు అంత‌మే లక్ష్యంగా ఐక్య‌రాజ్య స‌మితితో క‌లిసి  ప‌ని చేయ‌డానికి సిద్ద‌మైంది. మ‌హిళ‌ల గౌర‌వాన్ని కాపాడ‌టం అంద‌రి బాద్య‌త అంటూ యూఎస్ విమెన్ ఇండియా నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో స‌మంత స్వ‌రం వినిపించ‌నుంది. న‌వంబ‌ర్ 25 నుంచి డిసెంబ‌ర్ 10 వ‌ర‌కూ జ‌రిగే కార్య‌క్ర‌మంలో స‌మంత కూడా పాల్గొంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో స‌మంత‌కు 37 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.  

 

ఈనేప‌థ్యంలో వేధింపుల ప‌రంగా తాను ఎదుర్కున్న అనుభ‌వాలు పంచుకున్నారు. `సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతుంటారు. అవి ఎంతో అస‌భ్యంగా ఉంటాయి. ఫేక్ ఫోటోల‌తో ఎన్నో ర‌కాల ఇబ్బందులు ప‌డ్డాను. అశ్లీల ఫోటోలతో డీగ్రేడ్ చేసే వారెంతో మంది .  డీఫ్ ఫేక్ ఫోటోలతో మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కుంటోన్న‌ వారెంతో మంది. గ‌తంలో ప్ర‌త్య‌క్షంగా జ‌రిగిన ఈ హింస ఇప్పుడు స్క్రీన్ ల‌పై కి వ‌చ్చేసింది.

 

ఇది మాన‌సికంగా మ‌నిషిని కృంగ‌దీస్తుంది. న‌లుగురిలో త‌మ గొంతు విని పించ‌డానికి కూడా బ‌య‌ప‌డేలా చేస్తుంది. ఆత్మ విశ్వాస్వాన్ని దెబ్బ తీసి అభ‌ద్ర‌తా భావాన్ని క‌లిగిస్తుంది. ఇలాంటి ప‌రిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కున్నాను. ఇలాంటి వాటిపై మ‌హిళ‌ల్లో అవ‌గాహ‌న పెర‌గాలి. త‌ప్పును ఆరంభంలోనే తుంచాలి. అప్పుడే ఇలాంటివి ఆగుతాయి. ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మం ల‌క్ష్యం కూడా అదేన‌ని స‌మంత తెలిపింది. సామాజిక కార్య‌క్ర‌మాల్లో స‌మంత చురుకు పాల్గొంటుంది అన్న సంగ‌తి తెలిసిందే.  

samantha on online Harassment:

Samantha joins UN Women India 

Tags:   SAMANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ