ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో పని చేసింది. మహేష్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, రవితేజ, గోపీచంద్, నాగార్జున ఇలా చాలా మంది హీరోలతో సినిమాలు చేసింది. కానీ అనూహ్యంగా అమ్మడు టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ కి వెళ్లిన వైనం తెలిసిందే? ఇక్కడింకా అవకాశాలు వస్తున్నా? హిందీ సినిమాలు కీలకంగా భావించి వెళ్లిపోయింది. కొన్నాళ్ల పాటు సౌత్ సినిమాలపై కాస్త నెగిటివ్ గానూ మాట్లాడింది.
కానీ అక్షింతలు పడేసరికి ఆ స్పీడ్ తగ్గించింది. మళ్లీ ఇప్పుడు అదే పరిశ్రమలపై పాజిటివ్ గా స్పందించడం మొదలు పెట్టింది. వ్యక్తమైన నెగిటివిటీని పాజిటివ్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కొంత మంది స్టార్ హృలతో పని చేసిన అనుభవం నేపత్యంలో వారు ఎలా ఉంటారు? అన్నది చెప్పుకొచ్చింది. తారక్ మంచి నటుడని..అతడు పాట కోసం రిహార్సల్స్ చేయాల్సిన పనిలేదని, ఎంత కష్టమైన స్టెప్ అయినా సరే క్షణాల్లో నేర్చుకుంటాడంది.
టాలీవుడ్ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచిస్తాడంది. అతడితో టీమ్ వర్క్ బాగుంటుందంది. అలాగే రామ్ చరణ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నటుడంది. సెట్ లో సరదాగా ఉంటాడంది. ఇక మహేష్ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడంది. పిల్లలతో ఆయన వ్యవహరించే తీరే ఆయనేంటి? అనేది చెబుతుంది. మనసున్న మనిషి. కెరీర్ ను కూడా ఎంతో సీరియస్ గా తీసుకుని ముందుకెళ్తారంది. తెలుగులో ఎంతో మంది హీరోలతో పని చేసినా మహేష్ తో చేసిన స్పైడర్ మాత్రం ఎంతో నిరుత్సాహపరిచిన చిత్రంగా పేర్కొంది.
ఆ సినిమా ప్లాప్ తో బాధపడినట్ల తెలిపింది. ఆ ప్లాప్ ని తానో పాఠంగా తీసుకున్నట్లు తెలిపింది. వరుసగా ఎనిమిది, తొమ్మిది సినిమాల తర్వాత ఎదురైన ప్లాప్ చిత్రంగా చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.




రామాయణం రిలీజ్ ముందు టెన్షన్ లో డైరెక్టర్
Loading..