ఐబొమ్మ రవి కేసులో ఊహించని పరిణామాలు షాక్ కి గురి చేస్తున్నాయి. ఈ కేసులో చాలా ట్విస్టులు బయటపడుతున్నాయి. నిజానికి రవి మాస్టర్ మైండ్ కి పోలీసులకు, ఈడీకి కూడా దిమ్మతిరిగిపోతోంది. అతడు నిజానికి పైరసీ కేసులో అరెస్ట్ అయినా కానీ, అతడు పైరసీ చేయలేదు. నేరుగా థియేటర్ల నుంచి కాపీలు తీయలేదు. అతడు కేవలం పైరసీ వెబ్ సైట్ల నుంచి సినిమాలను కొనుగోలు చేసి అంతగా క్లారిటీ లేని బొమ్మల్ని హెచ్.డి బొమ్మలుగా మార్చాడు అంతే.
టెలీగ్రామ్, మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీ లాంటి సైట్ల నుంచి కొనుగోలు చేసి వాటిని హెచ్.డి.లోకి మార్చి అటుపై ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్లలో పోస్ట్ చేసేవాడు. ఆ తర్వాత బెట్టింగ్- గేమింగ్ యాప్ ల ప్రకటనల్ని ప్రమోట్ చేయడం ద్వారా మాత్రమే ఆదాయం ఆర్జించాడు.
ఈ విషయాలన్నీ చెబుతున్న పోలీసులే అతడి తెలివితేటలకు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఐబొమ్మ రవి సంఘ విద్రోహ శక్తుల నుంచి డబ్బు పిండుకున్నాడు. బెట్టింగ్ గేమింగ్ యాప్ లను నిర్వహించే ప్రమాదకర వ్యక్తుల నుంచి డబ్బు దండుకున్నాడు. అలాగే పైరసీ చేసే పెద్ద మాఫియాల నుంచి అధికారికంగా సినిమాలను కొనుక్కున్నాడు. వాటిని తన తెలివితేటలతో ఎన్ క్యాష్ చేసుకున్నాడు.
అలా అతడు 20కోట్లు సంపాదించాడు. కానీ ఇప్పుడు ఆ 20 కోట్లు ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. ఈ కేసులో అతడి నుంచి పోలీసులు బ్యాంకు ఖాతాల నుంచి ఫ్రీజ్ చేసింది కేవలం 3.5 కోట్లు మాత్రమే. రవికి చెందిన 35 అకౌంట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. వాటిలో ఎంత సొమ్ము ఉందో చెప్పలేదు. 17 కోట్ల డబ్బు అతడు విదేశీవిహారయాత్రల పేరుతో జల్సాలు చేసాడా? అనేది ఒక జవాబు లేని ప్రశ్న. క్రైమ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లిన ఐబొమ్మ రవి నిజంగా ఈ ప్రపంచంలో మాస్టర్ పీస్ అంటూ నెటిజనులు మద్ధతుగా నిలవడం మరో పెద్ద ట్విస్టు.




ఆంధ్ర కింగ్ తాలూకా ఓవర్సీస్ టాక్ 
Loading..