బాలీవుడ్, టాలీవుడ్ లో సుపరిచితమైన నటి సెలీనా జైట్లీ తన భర్త, ఆస్ట్రేలియన్ బిజినెస్ మేన్ పీటర్ హగ్‌పై గృహ హింస కేసు పెట్టారు. అతడు తనను శారీరకంగా మానసికంగా హింసించాడని, ఆస్తిని, డబ్బును దుర్వినియోగం చేసాడని, తన ముగ్గురు పిల్లలను కలవనీకుండా అడ్డుకుంటున్నాడని తన పిటిషన్ లో సెలీనా ఆరోపించారు. అతడి నుంచి 50కోట్ల పరిహారంతో పాటు నెలవారీగా 11లక్షల భరణం చెల్లించేలా ఏర్పాటు చేయాలని దావాలో పేర్కొన్నారు.
దుబాయ్, సింగపూర్ లో ప్రముఖ హోటల్ చైన్ వ్యాపారంలో ఉన్న పీటర్ ఆస్ట్రియా నివాసంలో ఉన్న తన ముగ్గురు పిల్లలతో మాట్లాడనీయడం లేదని, పిల్లలతో టెలీఫోన్ కమ్యూనికేషన్ ఇచ్చేలా కోర్టు అనుమతించాలని కూడా సెలీనా తన దావాలో పేర్కొన్నారు. 2011లో పెళ్లాడిన ఈ జంట వివాహంలో గత కొంతకాలంగా కలతలు మొదలయ్యాయి.
ఈ ఏడాది ఆగస్టులో పీటర్ విడాకుల కోసం దరఖాస్తు చేసాడు. అప్పటి నుంచి ముంబై ఆస్తులను తన పేరిట బదలాయించాలని తనపై ఒత్తిడి చేస్తున్నాడని కూడా జైట్లీ ఆరోపించారు. అతడికి మానసిక సమస్యలున్నాయని కూడా సెలీనా జైట్లీ తరపు న్యాయవాది ఒక ప్రకటనలో తెలిపారు. సెలీనా జైట్లీ టాలీవుడ్ లో మంచు విష్ణు సరసన సూర్యం అనే చిత్రంలో నటించారు.




ప్రకృతి వైద్యం కామెంట్స్ పై సోనాలి పై ట్రోల్స్ 
Loading..