బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే కొన్నేళ్ల క్రితం క్యాన్సిర్ బారిన పడి కోలుకుని ప్రస్తుతం ఆమె నార్మల్ లైఫ్ జీవిస్తున్నారు. అయితే సోనాలి బింద్రే పలు సందర్భాల్లో తను క్యాన్సర్ పై ఎలా పోరాడి గెలిచింది అనేది మోటివేషన్ స్పీచెస్ ఇస్తుంది. అలాంటి క్రమంలోనే ఆమె క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి తనకి ప్రకృతి వైద్యం ఏంతో దోహదపడింది అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రాజేశాయి.
సోనాలి చేసిన ప్రకృతి వైద్యం కామెంట్స్ పై డాక్టర్స్ అభ్యంతరాలు తెలుపుతున్నారు. దీంతో సోనాలి బింద్రే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. నేను ఎప్పుడూ డాక్టర్ని అని చెప్పలేదు. అంతేకాదు నేను మోసగత్తెని కూడా కాదు. నేను క్యాన్సర్ బారిన పడి నరకం అనుభవించినదాన్ని. క్యాన్సర్ వల్ల కలిగే భయం, నొప్పి, బాధ అన్నీ తెలిసిన వ్యక్తిని.
నేను ఏది మట్లాడినా అది నా అనుభవం మాత్రమే. దాని నుంచి నేను నేర్చుకున్న పాఠాలు. అసలు క్యాన్సర్లు అన్నీ ఒకేలాంటి లక్షణాలు కలిగిఉండవు. అంతేకాకుండా ఆ క్యాన్సర్లు కు చికిత్స కూడా వేరుగానే ఉంటుంది. దానిలో నేను తీసుకున్న ట్రీట్మెంట్ గురించి తెలిపానంతే. నేను ప్రకృతి వైద్యంతో క్యాన్సర్ జయించాను అని చెప్పాను, అంతేకాని దానిని అందరూ ఫాలో అవ్వమని చెప్పలేదు. ప్రతి వ్యక్తి తమకు సరైన, సురక్షితమైన విధానాలనే ఎంచుకోవాలని కోరుకుంటున్నా అంటూ సోనాలి బింద్రే ట్రోల్స్ కి వివరణ ఇచ్చుకుంది.




హీరోయిన్స్ పారితోషికాలపై మహానటి కామెంట్స్
Loading..