హీరో రామ్ పోతినేని-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో మహేష్ తెరకెక్కించిన ఆంధ్ర తాలూకా కింగ్ మరొక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ గురువారమే నవంబర్ 27 న విడుదల కాబోతున్న ఆంధ్ర తాలూకా కింగ్ తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఆంధ్ర కింగ్ తాలూకా కి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చెయ్యగా.. మొత్తం రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలు ఉండబోతుంది.
ఇక సెన్సార్ టాక్ లోకి వెళితే.. ఈ చిత్రానికి మ్యూజిక్ బిగ్గెస్ట్ హైలెట్ గా నిలవబోతుంది అంటున్నారు. ఇప్పటికే సాంగ్స్ యూత్ ని తెగ ఇంప్రెస్స్ చేసేశాయి. ఎమోషన్, మాస్, ఫ్యాన్ మూమెంట్స్ అన్ని ఆంధ్ర కింగ్ తాలూకా లో పుష్కలంగా ఉన్నాయి, తండ్రి - కొడుకు సెంటిమెంట్, రామ్-భాగ్యశ్రీ బోర్సే మధ్య రొమాన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర రోల్ ఎక్స్ట్రార్డినరీగా నిలబోతుంది అని, విలేజ్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు, ముఖ్యంగా టెంపుల్ సీక్వెన్స్ సినిమాకు పెద్ద అడ్డాంటేజ్ అంటూ సెన్సార్ రిపోర్ట్ చెబుతుంది.
అంతేకాదు సినిమాలో చివరి 30 నుంచి 40 నిమిషాలు ఓ రేంజులో ఉంటుంది, క్లైమాక్స్ అయితే ఊహకు కూడా అందనంత రీతిలో ఉండబోతుంది అని, ప్రొడక్షన్ వాల్యూస్ మెయిన్ హైలెట్స్ గా చెబుతున్నారు. మరోపక్క రామ్ ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ లు ఈ చిత్రాన్ని భీబత్సంగా ప్రమోట్ చేస్తున్నారు. సెన్సార్ టాక్ తో రామ్ ఈ చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొడతాడని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.




భర్తపై ప్రముఖ నటి గృహ హింస కేసు
Loading..