Advertisementt

BB 9: ఈవారం నామినేషన్స్-ఆమె మాత్రమే సేఫ్

Mon 24th Nov 2025 11:40 AM
bigg boss  BB 9: ఈవారం నామినేషన్స్-ఆమె మాత్రమే సేఫ్
BB9: 12th Week Nominations List BB 9: ఈవారం నామినేషన్స్-ఆమె మాత్రమే సేఫ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా మూడు వారాలు ఉంది, హౌస్ లో ఫ్యామిలీ వీక్, ఫ్యామిలీ ఎమోషన్స్, స్టేజ్ పై  ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ రావడం ఎమోషనల్ అవడం అన్ని నిన్న వారం తో కంప్లీట్ అయ్యాయి. ఇక మూడు వారాల గేమ్ లో టాప్ 5 లో ఉండాల్సిన ఐదుగురు మాత్రమే కాదు ఇంకో నలుగురు ఎక్స్ట్రా హౌస్ లో ఉన్నారు. అంటే మొత్తంగా హౌస్ లో తొమ్మిదిమంది ఉన్నారన్నమాట. 

మరి గత వారం సంజన సేవ్ అయ్యి దివ్య ఎలిమినేట్ అవ్వాల్సి ఉండగా.. దివ్య ను ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్ర తో సేవ్ చేసి హౌస్ లో ఉండేలా చేసాడు. మరి ఈ 12 వ వారంలో ఎవరు ఎవరిని ఎలిమినేట్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో నామినేషన్ పెట్టాల్సి ఉండగా.. ఈసారి పర్సనల్ గా బిగ్ బాస్ ఒపీనియన్స్ తీసుకున్నాడు. అందులో ఇమ్మాన్యుయేల్ పవన్ కంటెండర్ అయ్యాక తన ఆట ఎక్కడో ఆగిపోయింది అంటూ నామినేట్ చేసాడు. కళ్యాణ్ సుమన్ శెట్టి ని నామినేట్ చేసాడు. 

అనూహ్యంగా భరణి తనుజాని నామినేట్ చేసాడు. తనూజ తనని గొడవల మధ్యలోకి లాగుతుంది అంటూ నామినేట్ చెయ్యగా దివ్య భరణి నాకు సపోర్ట్ చెయ్యాల్సిన సమయంలో చెయ్యలేదు అంటూ నామినేట్ చెయ్యగా, పవన్ గత వారం లాగే కళ్యాణ్ ని నామినేషన్స్ లోకి లాగాడు.. మిగతా తనూజ, రీతూ, సంజన ల నామినేషన్స్ చూపించకపోయినా ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చింది ఎవరు అంటే.. 

కేవలం కెప్టెన్ గా ఉన్న రీతూ తప్ప మిగతా హౌస్ అంటే మిగిలిన ఎనిమిది మంది ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చారు అని సమాచారం. అందులో తనూజ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, డిమోన్ పవన్, సుమన్ శెట్టి, భరణి, దివ్య, సంజన నామినేషన్స్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. 

BB9: 12th Week Nominations List:

Bigg Boss Telugu 9:  12th week Nominations 

Tags:   BIGG BOSS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ