Advertisementt

వైరల్: ధనుష్-మృణాల్ సోషల్ మీడియా ట్వీట్స్

Mon 24th Nov 2025 12:43 PM
dhanush  వైరల్: ధనుష్-మృణాల్ సోషల్ మీడియా ట్వీట్స్
Dhanush Fuels Fresh Dating Rumours With Mrunal Thakur వైరల్: ధనుష్-మృణాల్ సోషల్ మీడియా ట్వీట్స్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరో ధనుష్ ఇంకా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారనే వార్త ఆ మద్యన బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లోను, కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లోను నడిచింది. ధనుష్ తన భార్య ఐశ్వర్య తో విడిపోయాడు. ఆతర్వాత సింగిల్ స్టేటస్ ని మైంటైన్ చేస్తున్న ధనుష్ మృణాల్ ఠాకూర్ తో ప్రేమలో పడ్డాడనే వార్త వైరల్ అయ్యి కూర్చుంది. 

ముంబైలో మృణాల్ ఠాకూర్ బర్త్ డే కి అటెండ్ అవడం, మృణాల్ నటించిన సినిమా ప్రీమియర్స్ లో ధనుష్ సందడి చెయ్యడంతో వారి మధ్యలో డేటింగ్ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం అలాంటిదేం లేదు ధనుష్ ఫ్రెండ్ మాత్రమే, నేను పిలిస్తే ప్రీమియర్ కి రాలేదు. ధనుష్ కి అజయ్ దేవగన్ సార్ తో ప్రత్యేక అనుబంధం ఉంది అందుకే అయన స్పెషల్ ప్రీమియర్ కి వచ్చాడు అని కొట్టిపారేసింది. 

తాజాగా మృణాల్ ఠాకూర్, ధనుష్ సోషల్ మీడియా ట్వీట్లు మరోసారి డేటింగ్ రూమర్స్ కి బలాన్ని చేకూర్చాయి.  మృణాల్ ఠాకూర్ నటించిన దో దీవానే షెహర్ మే టీజర్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. దానికి టీజర్ బావుంది అని ధనుష్ రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. 

ధనుష్ కామెంట్ కి మృణాల్ ఠాకూర్ లవ్ సింబల్ తో రిప్లై ఇవ్వడం చూసి వీరి మద్యన ఏదో నడుస్తుంది, అది ప్రేమే అంటూ మళ్లీ మృణాల్-ధనుష్ డేటింగ్ వార్తలను ప్రచారంలోకి వచ్చేలా చేసాయి. 

Dhanush Fuels Fresh Dating Rumours With Mrunal Thakur:

Dhanush, Mrunal Thakur spark dating rumours again with his comment on her post

Tags:   DHANUSH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ