పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించే చిత్రాల అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు మినీ యుద్ధమే చేస్తారు. ప్రభాస్ మీడియా ముందుకు రారు, అలా ప్రమోషన్స్ అన్ని వెనక్కి వెళ్లిపోతాయి. దానితో ఫ్యాన్స్ ఫీలవ్వని రోజు లేదు. అలాంటి సమయంలో ఒకే రోజు ప్రభాస్ సినిమాల రెండు అప్ డేట్స్ వస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవు.
నిన్న ఆదివారం ప్రభాస్-సందీప్ వంగ కలయికలో ఎప్పుడో అనౌన్సమెంట్ వచ్చిన స్పిరిట్ మూవీ పూజా కార్యక్రమాలు మెగాస్టార్ చేతుల మీదుగా స్పిరిట్ ఓపినింగ్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసారు. ఎన్నాళ్ళుగానో స్పిరిట్ ఓపినింగ్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు నిజంగా ఇది సూపర్ ట్రీట్ అనే చెప్పాలి.
అదే రోజు అంటే నిన్న సాయంత్రం రాజా సాబ్ నుంచి రెబల్ సాబ్ సాంగ్ రావడం వారిని మరింతగా సంతోషపరిచింది. రెబల్ సాబ్ లో ప్రభాస్ వింటేజ్ స్టయిల్ కి వింటేజ్ స్వాగ్ కి ప్రభాస్ డాన్స్ చూసి అభిమానులు బాగా ఎంజాయ్ చేసారు. మరి ఒకే రోజు స్పిరిట్ ఓపెనింగ్ అప్ డేట్, రాజా సాబ్ సాంగ్ రిలీజ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ అనే చెప్పాలి.




రివాల్వర్ రీటా రీసెంట్ లుక్
Loading..