రివాల్వర్ రీటా గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న కీర్తి సురేష్ ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో గ్లామర్ గాను, బ్యూటిఫుల్ గాను ఆకట్టుకునే ఫొటోస్ షూట్స్ తో సోషల్ మీడియా ని నింపేస్తుంది. వరసగా సినిమా ప్రమోషన్స్, అందుకు సంబందించిన లుక్స్ తో హడావిడి చేస్తున్న కీర్తి సురేష్ తాజాగా షేర్ చేసిన పిక్స్ ని చూసి వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే.
ముద్దమందారం మాదిరి ముద్దుగా కనిపించింది. జీన్స్ పై వైట్ డ్రెస్ వేసిన కీర్తి సురేష్ ట్రెడిషనల్ గాను, మోడ్రెన్ గాను మిక్స్డ్ లుక్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది. ఒకప్పుడు సాంప్రదాయినీ అన్నట్టుగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటుంది.
ఇక కొద్దిరోజులుగా తెలుగులో కనిపించని కీర్తి సురేష్ మళ్ళీ విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ తో పవర్ ఫుల్ కం బ్యాక్ కి సిద్ధమైంది. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లోనే కీర్తి సురేష్ వేణు డైరెక్షన్ లో ఎల్లమ్మ లో నటించే అవకాశం ఉంది.




బిగ్ బాస్ 9 - టాప్ 5 ని ఫిక్స్ అయ్యింది 
Loading..