పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్ లో దర్శనమిస్తున్నారు. రాజా సాబ్ తో వింటేజ్ లుక్ లో ప్యూర్ ప్రభాస్ ని దర్శకుడు మారుతి పరిచయం చేయబోతున్నారనే విషయమ ఇప్పటికే పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ లోను మాస్ కోణాన్ని వరసబెట్టి చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కి రాజా సాబ్ లో ప్రభాస్ కేరెక్టర్ చాలా రిలీఫ్ ఇచ్చింది.
ఇప్పుడు రాజా సాబ్ నుంచి థమన్ మ్యూజికల్ ఆల్బమ్ నుంచి రెబల్ సాంగ్ ని వదిలారు మేకర్స్. ఎప్పటినుంచో అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్న అభిమానులకు బెస్ట్ ట్రీట్ లా ఈ వింటేజ్ ప్రభాస్ రెబల్ సాంగ్ ఉంది. అలాగే ఈ పాటలో ప్రభాస్ స్టెప్స్ కూడా ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి.
రిచ్ సెటప్ తో ఈ రెబల్ సాంగ్ ని డిజైన్ చేసారు. థమన్ మ్యూజిక్, ప్రభాస్ లుక్స్ ఆయన స్టెప్స్, ముఖ్యంగా ప్రభాస్ లుక్ కి ఆయన అభిమానులు నిజంగా సంబరాలు చేసుకుంటున్నారు. మరి రెబల్ సాబ్ రాజా సాబ్ ని ఎక్కడివరకు అంటే ఎన్ని వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.




ఫ్యామిలీ మ్యాన్ 3 నటుల పారితోషికాలు
Loading..