Advertisementt

యుపి సీఎం ను కలిసిన బాలయ్య-బోయపాటి

Sun 23rd Nov 2025 10:31 PM
akhanda 2  యుపి సీఎం ను కలిసిన బాలయ్య-బోయపాటి
Akhanda 2 The Thaandavam Team Meet UP CM Yogi Adityanath యుపి సీఎం ను కలిసిన బాలయ్య-బోయపాటి
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను డివోషనల్ యాక్షన్ విజువల్ వండర్ అఖండ 2 ది తాండవం పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధంగా ఉంది. ముంబైలో ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. బెంగళూరులో అద్భుతమైన ట్రైలర్ లాంచింగ్ తర్వాత ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ సనాతన ధర్మాన్ని అద్భుతంగా చాటి చెప్పింది .

బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నటి సంయుక్త, నిర్మాతలు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అఖండ టీంని కలవడానికి సమయం ఇచ్చారు. సినిమాలో రష్‌లను వీక్షించారు. ఈ సినిమా భారీ కాన్వాస్, భక్తి కథనం, అద్భుతమైన విలువలని ప్రదర్శించే విధానం చూసి ముఖ్యమంత్రి ముగ్ధులయ్యారు.

చిత్ర యూనిట్ యోగి ఆదిత్యనాథ్‌కు సింబాలిక్ ట్రైడెంట్‌ను బహుకరించింది. అద్భుతమైన కంటెంట్ ప్రేక్షకులకు అందరిలో ప్రతిధ్వనించే  భక్తి చిత్రాన్ని అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి నిర్మాతలను ప్రశంసించారు.

ఈ హై-ప్రొఫైల్ సమావేశం సినిమా పాన్-ఇండియా ఎట్రాక్షన్ ని బలోపేతం చేయడమే కాకుండా ఉత్తర భారత మార్కెట్‌లో ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. విడుదల దగ్గర పడుతుండటంతో, అఖండ 2 బృందం ప్రమోషన్‌లను మరింత పెంచడానికి సన్నాహాలు చేస్తోంది,స్టార్ పవర్, భక్తి ఇతివృత్తాలు, కీలకమైన సాంస్కృతిక వ్యక్తులకు చేరువ కావడం అఖండ 2 ను సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఈవెంట్‌ గా నిలిపింది.

Akhanda 2 The Thaandavam Team Meet UP CM Yogi Adityanath:

Balakrishna, Boyapati and Makers Of Akhanda 2 Meet UP CM Yogi Adityanath

Tags:   AKHANDA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ